E-Paper
Advertisement

Hyderabad: ఒకే నెంబర్ తో నాలుగు బైక్ లు.. చలాన్లు చూసి అసలు ఓనర్ షాక్

Hyderabad: ఒకే నెంబర్ తో నాలుగు బైక్ లు.. చలాన్లు చూసి అసలు ఓనర్ షాక్
Advertisement

Hyderabad: హైదరాబాద్ నగరంలో షాకింగ్ విషయం బయటపడింది. ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్ (TS34 C 1858)పై నాలుగు ద్విచక్ర వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అసలు ఓనర్ కు తెలియకుండా మరో ముగ్గురు అదే నెంబర్ ప్లేట్ తో బైక్ లు నడుపుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినప్పుడు… ఓనర్ కు చలాన్లు వస్తున్నాయి. దీంతో బైక్ లో ఫొటోలు తీస్తే అసలు విషయం బయటపడింది.

అసలు ఓనర్ కు చలాన్ల మోత

హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్తోన్న ఓ వ్యక్తిని ఆపి చలాను రాశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ చలాను.. అసలు నెంబర్ ప్లేట్ కలిగిన బైక్ ఓనర్ బేగరి గోపాల్ కు చేరడంతో షాక్ కు గురయ్యాడు. అప్పటికే తన బైక్ పై పలు చలాన్లు ఉండడంతో.. వెంటనే ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు. చలాన్లు పడ్డ బైక్ ఫొటోలను ట్రాఫిక్ పోలీసుల సాయం చూడగా.. ఆ వాహనాలు తనవి కాదని గోపాల్ గుర్తించాడు.

ఒకే నెంబర్ తో నాలుగు బైక్ లు

Advertisement

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒకే నెంబర్ ప్లేట్ తో నాలుగు బైకులను గుర్తించారు. బాధితుడు బైక్ బీహెచ్ఈఎల్ లో ఉండగా అదే నెంబర్ ప్లేట్ తో వికారాబాద్, సంగారెడ్డి, బేగంపేటలో మరో మూడు ఉన్నట్లు గుర్తించారు. మరో ముగ్గురు నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసి ఈ వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను కోరగా… ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: : ఒకే నెంబర్ తో నాలుగు బైక్ లు.. చలాన్లు చూసి అసలు ఓనర్ షాక్

డూప్లికేట్ నెంబర్ ప్లేట్ దందా

Advertisement

డూప్లికేట్ నంబర్ ప్లేట్లు తయారు చేసిన వారితో పాటు, వాటిని అక్రమంగా ఉపయోగిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటువంటి మోసాల వల్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన చలాన్లను తరచూ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. డూప్లికేట్ నెంబర్ ప్లేట్ లు ఉన్న వాహనాలను చోరీలు, ఇతర నేరాలకు ఉపయోగించే అవకాశం ఉందంటున్నారు.

Related News

పోలీస్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ న్యూస్ మీకోసమే

పెద్ద కూతురు పెళ్లి కోసం.. కన్న బిడ్డను అమ్ముకోవాలనుకున్న తల్లి.. ఎక్కడంటే?

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. అసెంబ్లీకి ఇద్దరు సీనియర్ నేతలు దూరం?

సిటీలో స్వచ్ఛమైన నీటిలో గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారా.. అయితే ఇక్కడికి రండి?

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ వయోపరిమితి పెంపు అప్డేట్.. సీఎం హమీ?

సంగారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్.. కమిటీలను ప్రకటించిన జగ్గారెడ్డి!

విధులకు రాకుండానే జీతాలు డ్రా.. కనుకులగిద్దే పల్లె దవాఖానలో అక్రమ డిప్యూటేషన్ దందా!

ఉన్మాదుల్లా ప్రవర్తించారు.. BRSపై రేవంత్ రెడ్డి ఫైర్

Big Stories

Advertisement
×