BigTV English

HYDRAA BOSS: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మాస్టర్ మైండ్, హైడ్రా బాస్ ఈయనే.. హైద్రాబాద్ క్లీన్ చేయడమే లక్ష్యం

HYDRAA BOSS: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మాస్టర్ మైండ్, హైడ్రా బాస్ ఈయనే.. హైద్రాబాద్ క్లీన్ చేయడమే లక్ష్యం

HYDRAA BOSS IPS AV Ranganath | హైదరాబాద్ నగరంలో ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ గురించి.. అలాగే ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన హైడ్రా గురించి. హైద్రాబాద్ లో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించుకొని నిర్మించుకున్న అక్రమ కట్టడాలను కూల్చి వేయడమే హైడ్రా టార్గెట్.


హైడ్రా ఏజెన్సీని తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఈ ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయడం జరిగింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఐపిఎస్ ఎవి రంగనాధ్ ను హైడ్రా కు బాస్‌గా నియమించారు. డ్యూటీలో సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్న రంగనాధ్ హైడ్రా కు మాస్టర్ మైండ్ గా మారారు. హైదరాబాద్ నగర భూ ప్రక్షాళనలో భాగంగా అక్రమంగా భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

నగరంలో కబ్జాలకు గురైన భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం.. అక్రమ నిర్మాణాలను కూల్చడంతో పాటు చెరువులను కాపాడడం, బఫర్ జోన్లలో ఉన్న భూములను ప్రైవేట్ సంస్థల చేతుల్లో నుంచి స్వాధీనం చేసుకోవడమే హైడ్రా ప్రధాన బాధ్యతలు.


హైడ్రా ప్రారంభమైన నెల రోజుల్లోనే విజయవంతంగా 150 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు 140 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. కూల్చివేతకు గురైన అక్రమ నిర్మాణాల్లో 50 అంతస్తుల భవనాలు కూడా ఉండడం గమనార్హం.

హైద్రాబాద్ లోని మొత్తం 185 చెరువులు, కుంటల పరసరాల్లో కబ్జాలకు గురైన అన్ని బఫర్ భూములను స్వాధీనం చేసుకుంటామని హైడ్రా ప్రకటించింది. 185 చెరువుల భూముల్లో దాదాపు 60 శాతం కబ్జాలకు గురైనట్లు గుర్తించామని హైడ్రా అదికారులు తెలిపారు. అయితే ఐపిఎస్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ కబ్జాలపై వేగంగా చర్యలు తీసుకుంటామని.. నగరంలో ఇలాంటి కబ్జాలు లేకుండా చేస్తామని అధికారులు చెప్పారు.

హైడ్రా కోసం ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్, ఇద్దరు ఏసీపీలు, ఆరుగురు ఇన్స్‌పెక్టర్లతో పాటు 30 మంది సిబ్బంది పనిచేస్తారని ఐపిఎస్ రంగనాథ్ తెలిపారు. భూ కబ్జాలపై సామాన్య పౌరులు సైతం ఫిర్యాదులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.

తాజాగా హైద్రాబాద్ లోని మాదాపూర్ లో నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్ష్ కూల్చివేత తరువాత సెలబ్రిటీలైనా సామాన్యులైనా భూ కబ్జాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హైడ్రా స్పష్టం చేసింది.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×