BigTV English

KCR : పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొడుతోందా?

KCR : పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొడుతోందా?

KCR : పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొడుతుంది.. ఈ సామెతను కేసీఆర్ తరుచూ చెబుతుంటారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే.. ఆ నానుడి కేసీఆర్ విషయంలోనే నిజమైందని అంటున్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓ ముగ్గురు ప్రలోభ పెట్టారనే న్యూస్ ఇప్పుడు తెలంగాణలో కాక రేపుతోంది. గులాబీ దళం కమలనాథులను కార్నర్ చేస్తుండగా.. బీజేపీ సైతం అదే రేంజ్ లో రివర్స్ అటాక్ కు దిగుతోంది. అయితే, దొందుదొందేనంటూ మిగతా పక్షాలు మండిపడుతున్నాయి.


కేసీఆర్ ఏమైనా సుక్కంపూసనా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి లాక్కోలేదా? మరి, కాంగ్రెస్ వారిని ఎన్ని వందల కోట్లు పెట్టి కొన్నారు? ఇవీ బీజేపీ నేతలు వేస్తున్న ప్రశ్నలు. అధికారంలోకి రాగానే.. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇన్నాళ్లూ అన్నిపార్టీల నుంచి నాయకులను కేసీఆర్ లాగేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వల విసురుతుండటంతో.. కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అంటున్నారు. ఇన్నాళ్లూ ఆయన చేసింది ఒప్పు అయితే, తాజా పరిణామం తప్పు ఎలా అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఆపరేషన్ ఆకర్ష్.. కేసీఆర్ బ్రాండ్ స్ట్రాలజీ. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కొత్తలో.. ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ ఎమ్మెల్యేలను నయానో భయానో పార్టీలో కలుపేసుకున్నారు. ఎర్రబెల్లి ఆధ్వర్యంలోని టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసేశారు. తెలంగాణ పునరేకీకరణ అంటూ ఆ ఫిరాయింపులకు అందమైన పేరు పెట్టిన ఘనత కేసీఆర్ దే. రెండోసారి కావాల్సినంత మెజార్టీ వచ్చినా.. మళ్లీ కాంగ్రెస్ సభ్యులను కారు ఎక్కించేశారు. కాంగ్రెస్ కు కాలం కలిసి రాకపోవడంతో.. కేసీఆర్ కు ధీటుగా సమాధానం చెప్పలేకపోయింది. కానీ, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టాక.. హస్తం పార్టీ మళ్లీ జవసత్వాలు పుంజుకుంటోంది. వలసలకు అడ్డుకట్ట పడింది.


రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ మరింత బలపడకుండా చెక్ పెట్టేందుకే అన్నట్టు.. కేసీఆర్ బీజేపీని రెచ్చగొట్టడం స్టార్ట్ చేశారు. ఢిల్లీ ప్రోత్సాహంతో కమలనాథులు సైతం గులాబీ బాస్ తో సై అంటే సై అంటూ దూకుడు పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ దూకుడులో భాగంగానే.. టీఆర్ఎస్ నేతలపై వల విసురుతున్నారు. జితేందర్ రెడ్డి, స్వామి గౌడ్, బూడిద భిక్షమయ్య గౌడ్, రాములునాయక్, విఠల్ తదితర గులాబీ నేతలకు కాషాయ కండువా కప్పేసింది. మునుగోడు ఎలక్షన్ తో ఆ రెండు పార్టీల మధ్య వరుసగా ఆకర్ష్.. వికర్ష్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. బూర అటు వెళ్లగా.. బూడిద, స్వామి గౌడ్ లు ఇటువైపు వచ్చారు. ఆ పోటాపోటీ రాజకీయాల్లో భాగంగానే.. లేటెస్ట్ గా మోయినాబాద్ ఫాంహౌజ్ ఘటన జరిగిందని అంటున్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆ ముగ్గురు గాలం వేయగా.. ఆ చేపలు జస్ట్ మిస్. లేదంటే, ఈపాటికి కేసీఆర్ లో కంగారు కనిపించేది. ఇన్నాళ్లూ పొడుగోడులాంటి కేసీఆర్ కాంగ్రెస్ ను కొడితే.. ఇప్పుడో పోచమ్మ లాంటి బీజేపీ గులాబీ బాస్ పని పడుతోందంటూ తెలంగాణలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×