E-Paper
Advertisement

ఇందిరమ్మ హోమ్స్ టవర్స్ లాటరీ ఆగష్టు 27 నుంచి.. జాబితాలో పేరు ఇలా చెక్ చేసుకోవచ్చు

ఇందిరమ్మ హోమ్స్ టవర్స్ లాటరీ ఆగష్టు 27 నుంచి.. జాబితాలో పేరు ఇలా చెక్ చేసుకోవచ్చు
Advertisement

Indiramma Griha Towers Lottery: హైదరాబాద్ సిటీ ఔటర్‌రింగ్ రోడ్ పరిధిలో ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ హోమ్స్ టవర్స్‌లో ఇళ్ల కేటాయింపు రంగం సిద్ధమైంది. లాటరీ ప్రక్రియ ద్వారా పూర్తి కానుంది. ఆగస్టు 27న లాటరీ ప్రక్రియ ప్రారంభంకానుంది. దీనికి సంబంధించి దాదాపుగా అన్నిపనులు పూర్తి అయినట్టు తెలుస్తోంది.

 

ఇందిరమ్మ హోమ్స్ టవర్స్ లాటరీ

Advertisement

హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకున్న కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ-క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ టవర్స్‌లో ఇళ్ల కేటాయింపునకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ చుట్టూ ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 7,340 ఇళ్లకోసం హౌసింగ్‌ బోర్డుకు 60,720 పైగానే దరఖాస్తులు వచ్చాయి. అందులో సుమారు 40 వేలకు పైగా దరఖాస్తులు అర్హత సాధించినట్లు సమాచారం. సీజీజీ ఆధ్వర్యంలో 360 డిగ్రీ విధానంలో ఆన్ లైన్‌లో అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వినియోగదారులు దరఖాస్తు చేశారా? లేదా? ఫ్లాట్‌కు దక్కించుకునేందుకు అర్హులా? అనర్హులు కాకపోతే ఎందుకు? అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయ్యింది? వంటి వివరాలను అధికారులు వెబ్ సైట్లో స్పష్టంగా పొందుపర్చనున్నారు.

 

ఆగష్టు 27 నుంచి మొదలు, జాబితాలో పేరు చెక్ చేసుకోవచ్చు

Advertisement

అర్హుల జాబితా వెబ్‌సైట్‌ https://tghb.telangana.gov.inలో అప్లికేషన్‌ /ఫోన్‌ నంబర్‌ ఆధారంగా స్టేటస్‌ తెలుసుకోవచ్చు. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే ఆగస్టు 23 లోగా వెబ్‌సైట్‌లో రిపోర్డు చేయవచ్చు. లాటరీకి అర్హత సాధించిన వారి జాబితాను ఈనెల 25న ప్రకటించనున్నారు అధికారులు. ఆగస్టు 27-30 మధ్య నియోజకవర్గాల వారీగా లాటరీ తీసి ఇళ్లను కేటాయించనున్నారు అధికారులు. లాటరీలో పేర్లు వచ్చిన వారికి ఎల్‌ఐజీ ఫ్లాట్లు కేటాయిస్తారు. రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున లాటరీ తీయనున్నట్లు హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ వెల్లడించారు.

ALSO READ: సున్నం చెరువు గ్రేట్ మేకోవర్.. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం!

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులతో సహా రిజర్వేషన్ కేటగిరీల ప్రకారం డ్రా నిర్వహించబడుతుంది. ప్రతి కేటగిరీకి దరఖాస్తుదారులలో 20 శాతం మందితో కూడిన జాబితాను తయారు చేస్తారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై ఎలాంటి అపోహలకు గురికావద్దని తెలిపారు. అర్హుల గుర్తింపు నుంచి లాటరీ వరకు ప్రతి దశను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. లాటరీ ద్వారా పేర్లను ఎంపిక చేస్తారు. సందేహాల కోసం, దరఖాస్తుదారులు 040‑24603572 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Related News

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

Big Stories

Advertisement
×