BigTV English

Jaipal Reddy Jayanthi celebrations : ఘనంగా జైపాల్‌రెడ్డి జయంతి వేడుకలు.. నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు..

Jaipal Reddy Jayanthi celebrations : ఘనంగా జైపాల్‌రెడ్డి జయంతి వేడుకలు.. నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు..

Jaipal Reddy Jayanthi celebrations : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డికి హైదరాబాద్‌లో ఘనంగా నివాళులర్పించారు పలువురు పార్టీ నేతలు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శమని ప్రసంశల జల్లు కురిపించారు. జైపాల్‌రెడ్డి మరణం దేశానికి తీరనిలోటని అన్నారు తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌. ఆయన పార్లమెంట్‌లో మాట్లాడితే ఆ వ్యాఖ్యలను స్పీకర్ డిక్షనరీలో వెతికాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. జైపాల్‌రెడ్డి విజన్‌ ఉన్న నేత అని ఆయన సేవలను స్మరించుకున్నారు దీపా దాస్‌.


ఎంపీగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా తెలంగాణకే కాదు.. దేశానికి కూడా ఆయన సేవలందించారని స్మరించుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఇక ఈ సందర్భంగా పాలమూరు జిల్లాకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టేలా సీఎం రేవంత్‌రెడ్డికి దృష్టికి తీసుకువెళ్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

జైపాల్‌రెడ్డి రాజకీయ జీవితాన్ని ఓ పాఠ్యాంశంగా తీసుకోవాల్సినంత నిబద్ధత, నిజాయితీగా పని చేశారని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు. ఆయన మరణం తెలంగాణకే కాదు.. భారత దేశానికే తీరని లోటని అన్నారు తుమ్మల.


పాలమూరు ముద్దుబిడ్డ జైపాల్‌రెడ్డి ఒక్క తెలంగాణకే కాదు.. యావత్ భారతదేశానికి గర్వకారణమని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈనాటి రాజకీయ నేతలు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేంతలా పని చేశారని.. లోక్‌సభలో మాట్లాడితే పార్లమెంట్ నిశ్శబ్ధంగా ఉండేంతలా చర్చను సాగించేవారని ప్రశంసలు గుప్పించారు.

.

.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×