E-Paper
Advertisement

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదంటే ఇదేనేమో.. జమ్మికుంటలో విచిత్ర పరిస్థితి?

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదంటే ఇదేనేమో.. జమ్మికుంటలో విచిత్ర పరిస్థితి?
Advertisement

Jammikunta: పట్టణ సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించినప్పటికీ, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యం కారణంగా జమ్మికుంటలో అభివృద్ధి పనులు పూర్తిగా పడకేశాయి. “దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని” చందంగా పట్టణ పరిస్థితి తయారైంది. ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.15 కోట్ల నిధులను మంజూరు చేసి 15 నెలలు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల ఊసే లేకుండా పోయింది.

టెండర్లు పూర్తయినా ఏఈ తాత్సారం..

పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం మున్సిపల్ అధికారులు నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు టెండర్లు వేసి ఎంపికై ఎనిమిది నెలలు గడిచింది. నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్లతో అధికారిక ఒప్పందాలు (అగ్రిమెంట్లు) చేయించి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పై ఉంది. కానీ, సుమారు 6 నెలలుగా ఆ కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేయకుండా ఏఈ తీవ్ర జాప్యం చేస్తూ కాలయాపన చేస్తున్నారని, దీనివల్లే పనులకు మోక్షం లభించడం లేదని పట్టణవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్టర్ల వ్యక్తిగత సమస్యలే కారణం: ఏఈ వివరణ..

Advertisement

ఈ జాప్యంపై మున్సిపల్ ఏఈని ‘స్వేచ్ఛ ప్రతినిధి ’ వివరణ కోరగా.. రూ.15 కోట్ల నిధులకు సంబంధించి మొత్తం 24 పనులకు గాను 9 మంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారని తెలిపారు. అందులో ఇప్పటికే 3 పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. అయితే అగ్రిమెంట్లు చేసుకున్న కాంట్రాక్టర్లు తమ వ్యక్తిగత సమస్యల కారణంగా పనులను ప్రారంభించలేదని, మిగిలిన ప్రక్రియను కూడా పూర్తి చేసి త్వరలోనే పనులు ముందుకు సాగేలా చూస్తామని ఆయన వివరించారు. ఏది ఏమైనప్పటికీ, కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నా నెలల తరబడి పనులు ముందుకు సాగకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి, ఆగిన అభివృద్ధి పనులను త్వరితగతిన పట్టాలెక్కించాలని జమ్మికుంట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also read: పార్క్‌లో మొదలైన ప్రేమ… పెళ్లి తర్వాత ఊహించని మలుపులు.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

Tags

Related News

త్యాగాలకు తగిన గుర్తింపు.. ఉద్యమకారులకు అండగా సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కి డేట్ ఫిక్స్!

నిజాం కంటే.. కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులే ఎక్కువ.. ఎంపీ చామల తీవ్ర ఆరోపణలు!

ఖాతాల్లో రూ.813 కోట్లు పెట్టుకుని ఏం చేస్తున్నారు? కలెక్టర్లపై మంత్రి ఉత్తమ్ ఫైర్!

సీఎం రేవంత్‌ రెడ్డికి.. కేటీఆర్ ఛాలెంజ్..?

నేటికి ఎన్నికలు జరగని 58 గ్రామపంచాయతీలకు గుడ్‌ న్యూస్!

హరీష్ రావు ఇలాకాలో దారుణం.. గ్రామంలో నివాసమున్నా మాదిగల అడ్రస్ మాయం!

Big Stories

Advertisement
×