E-Paper
Advertisement

70 కోట్ల భారతీయులు…ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌లు అసలు చూడటమే లేదు

70 కోట్ల భారతీయులు…ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌లు అసలు చూడటమే లేదు
Advertisement

Nauman Niaz On IND VS PAK: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ లపై మాజీ క్రికెటర్ నౌమాన్ నియాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లను 70 కోట్ల మంది భారతీయులు అసలు చూడటమే లేదంటూ బాంబ్ పేల్చారు. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లు వన్ సైడెడ్ గా సాగుతున్న క్రమంలో ఎవరూ పట్టించుకోవడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

70 కోట్ల భారతీయులు…ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌లు అసలు చూడటమే లేదు

పాకిస్తాన్ ప్రతీ మ్యాచ్ లోనూ ఓడిపోతుందని.. అందుకే అందరికీ ఇంట్రెస్ట్ పోయిందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ను ఎంత ఘోరంగా టీమిండియా ఓడించి అవమానిస్తుందో చూడటానికే మ్యాచ్ లు చూస్తున్నట్టు నౌమాన్ నియాజ్ కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఇలాగే భవిష్యత్తులోనూ టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే…ఆ మాత్రం చూసేవాడు కూడా ఉండబోడని సెటైర్లు పేల్చారు. ఇకనైనా పాకిస్తాన్ క్రికెట్ జట్టు పికప్ కావాలని కోరారు. దీంతో నౌమాన్ నియాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

టీమిండియా వర్సెస్ పాక్ మధ్య తగ్గిన పస

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఒకప్పుడు మ్యాచ్ లు జరిగితే, జనాలు ఎగబడి చూసేవారు. చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగేది. దీంతో మ్యాచ్ జరిగితే, జనాలు అందరూ ఇంట్లోనే ఉండేవారు. పనులు మానుకుని టీవీలకే అతుక్కుపోయేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు జరిగితే, కచ్చితంగా టీమిండియానే విజయం సాధిస్తుందనే అంచనాకు ఫ్యాన్స్ వచ్చేశారు. అప్పట్లో ఆడినట్టుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన ఉండటం లేదు. దీంతో గత ఏడు సంవత్సరాలుగా మ్యాచ్ వన్ సైడ్ గా సాగుతోంది. ఇలాంటి తరుణంలోనే మ్యాచ్ చివరి వరకు వచ్చేదాకా టీవీలు పెట్టడం లేదు.

Advertisement

పాకిస్తాన్ చిత్తుగా ఓడితే, చూసి టీవీలు ఆపేస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా పాక్ మాజీ ప్లేయర్ నౌమాన్ నియాజ్ తెలిపే ప్రయత్నం చేశారు. టీమిండియాపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు సరైన పోటీని ఇవ్వడం లేదని వెల్లడించారు. 7 ఏళ్లుగా టీమిండియాను ఓడించకుండా చేతులు దులుపుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే 2027 వన్డే వరల్డ్ కప్ లోనైనా టీమిండియాను ఓడించాలని కోరారు. లేకపోతే పాకిస్తాన్ కాస్త ఉగాండా అవుతుందని హెచ్చరించారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా దృష్టి సారించాలని కోరారు. పాకిస్తాన్ దేశ పరువు తీయకుండా, భారత జట్టును ఓడించే ప్రయత్నాలు మొదలు పెట్టాలని సూచనలు చేశారు.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

ఆ దరిద్రుడు పోయాడు..ఇక టీమిండియాకు అన్ని మంచి రోజులే

కష్టకాలంలో కోహ్లీకి అండగా బీసీసీఐ నిలిస్తే, బాబర్‌ను PCB రోడ్డున పడేసింది

కుల్దీప్ యాదవ్ కంటే నేనే తోపు..కానీ, నన్నే తొక్కేశారు !

టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ…తల పట్టుకుంటోన్న RCB యాజమాన్యం ?

స్మృతి మంధానతో గొడ‌వ‌లు…హర్మన్‌ప్రీత్ కౌర్ తో బ‌ల‌వంత‌పు రాజీనామా ?

వీడి బౌలింగ్ లో సిక్స్ కొడితే, నెక్స్ట్ బంతికే మటాషే…ప్ర‌త్య‌ర్థిని వ‌ణికిస్తోన్న నమన్ ధీర్

ఇది క‌దా స్కెచ్ అంటే…ఐసీసీ కొత్త రూల్స్ వాడుకుని విండీస్ ని దెబ్బ‌కొట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్

Big Stories

Advertisement
×