E-Paper
Advertisement

జూరాల ఎడమ కాలువ వద్ద హైటెన్షన్.. ప్రాజెక్టుల వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు!

జూరాల ఎడమ కాలువ వద్ద హైటెన్షన్.. ప్రాజెక్టుల వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు!
Advertisement

Jurala Water: స్వేచ్ఛ బ్యూరో: ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి సాగునీటి కోసం రైతాంగం చేస్తున్న పోరాటం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అమరచింత మండల పరిధిలోని జూరాల ఎడమ కాలువ వద్దకు పోనివకుండా రైతాంగాన్ని అడుకునేందుకు అడుగడుగున భారీగా పోలీసులు మొహరించారు. జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నంచే క్రమంలో రైతులకు పోలీసుల మద్య తోపులాట జరిగింది. మక్తల్ మాజీ ఎమ్మెల్యే ను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు‌. ఈ క్రమంలో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

ప్రాణాలను తెగించి కాలువలోకి దిగిన రైతులు

సాగునీరు విడుదల చేయాలని నిరసిస్తూ రైతులు ఏకంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమాంతర కాలువలోకి దిగి, జూరాల ఎడమ కాలువ రెగ్యులేటర్ వైపు నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలు జూరాల ప్రాజెక్టును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

రహదారులపై దిగ్బంధం – పొలాల వెంబడి నడిచి ప్రాజెక్టుకు..

Advertisement

రైతులు జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకోకుండా పోలీసులు ప్రధాన రహదారులపై అడ్డంకులు ఏర్పాటు చేయడంతో, అన్నదాతలు పొలాల వెంబడి కిలోమీటర్ల మేర కాళ్లతో నడుచుకుంటూ జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నారు. పోలీసులు ఆంక్షలు విధించి అదుపులోకి తీసుకుంటున్నా.. నీళ్ల కోసం రైతులు చూపిస్తున్న తాపత్రయం అందరినీ కదిలిస్తోంది.

రాజకీయ నాయకుల ముందస్తు అరెస్టులు

రైతులతో కలిసి ధర్నాకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నాయకులను, మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజుకుంటున్న నీటి పోరాటం..

Advertisement

ఒక్క జూరాల మాత్రమే కాకుండా, కోయిల్ సాగర్, సంగంబండ రిజర్వాయర్ల కింద ఉన్న కాలువలకు కూడా వెంటనే నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో దాదాపు 100 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా వదిలేయడం వల్ల ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిపోతోందని, స్థానిక రైతులకు అన్యాయం జరుగుతోందని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మరియు ఇరిగేషన్ అధికారులు సాగునీటి విడుదలపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో రైతుల్లో అసహనం, ఆందోళన మరింత తీవ్రమవుతున్నాయి.

Also Read: అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!

Tags

Related News

జూరాల రైతుల అరెస్టులపై హరీష్ రావు ఫైర్.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్!

అక్టోబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు.. ఎందుకో తెలుసా..?

గాంధీభవన్‌లో కేసీఆర్ అన్నకూతురు.. బీఆర్ఎస్‌లో రగులుతున్న కాక!

త్యాగాలకు తగిన గుర్తింపు.. ఉద్యమకారులకు అండగా సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కి డేట్ ఫిక్స్!

నిజాం కంటే.. కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులే ఎక్కువ.. ఎంపీ చామల తీవ్ర ఆరోపణలు!

ఖాతాల్లో రూ.813 కోట్లు పెట్టుకుని ఏం చేస్తున్నారు? కలెక్టర్లపై మంత్రి ఉత్తమ్ ఫైర్!

Big Stories

Advertisement
×