Maoists : ఆపరేషన్ కర్రెగట్టలు. రెండు వారాలుగా హైటెన్షన్. ఏకంగా 10 వేలకు పైగా జవాన్లు. ములుగు జిల్లా సమీపంలోని గుట్టలను చుట్టుముట్టారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వైపు నుంచి ఒకేసారి ఆపరేషన్ జరుగుతోంది. లోకల్ పోలీసులు ఎవరూ లేరు. CRPF, కోబ్రా టీమ్స్ కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. వారాల తరబడి సాగుతోంది కూంబింగ్. తిండి లేదు, నీళ్లు లేవు. పైనుంచి ఎండ చంపేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో సోల్జర్స్ వడదెబ్బతో ఆసుపత్రిలో చేరారు. ఎంతో ఫిట్‌గా ఉండే కోబ్రా టీమ్ సభ్యులే ఆ గుట్టలు ఎక్కలేకపోతున్నారంటే.. అదెంత టఫ్ ప్లేసో తెలుస్తోంది. అందుకే, పక్కాగా ప్లాన్ చేసి మరీ కర్రెగుట్టలను సేఫ్ జోన్‌గా మార్చుకున్నారు మావోయిస్టులు. జవాన్లకు సవాళ్లు విసురుతున్నారు.
ల్యాండ్ మైన్ బ్లాస్ట్
కర్రెగుట్టల నిండా ల్యాండ్ మైన్స్ పెట్టారు మావోయిస్టులు. అడుగు ముందుకు వేయాలంటే.. వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఏ ఆకుల కింద బాంబులున్నాయో.. ఏ చెట్టు చాటున మైన్స్ పెట్టారో తెలీదు. అందుకే, అతి జాగ్రత్తగా ఇంచుఇంచు వెతుకుతూ.. ఎక్కడికక్కడ ల్యాండ్ మైన్స్ డిఫ్యూజ్ చేస్తూ కూంబింగ్ చేస్తున్నారు. కానీ, సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా దురదృష్టవశాత్తు ఓ జవాన్ ల్యాండ్ మైన్‌పై కాలు వేయడంతో బ్లాస్టింగ్ జరిగింది. కోబ్రా కంపెనీ అసిస్టెంట్ కమాండెంట్ సాగర్ బొరడే కి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఆర్మీ హెలికాప్టర్‌లో హుటాహుటిన బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కూంబింగ్ కొనసాగుతోంది.
మావోయిస్టుల దగ్గర ఇంజెక్షన్లు..
మరోవైపు, కర్రెగుట్టల్లో కూంబింగ్ చేస్తున్న సాయుధ బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీ ఎన్‌కౌంటర్ కొనసాగింది. కాల్పుల్లో ఒక మావోయిస్టు హతమయ్యాడు. మిగతా దళ సభ్యులు పరారీ అయ్యారు. అయితే, చనిపోయిన మావోయిస్టు దగ్గర విటమిన్ ఇంజెక్షన్లు, ప్రోటీన్ ఇంజెక్షన్లు లభించడం ఆసక్తికరం. అంటే, ఎన్ని రోజులైనా, ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సన్నద్ధంగా ఉండేలా.. మావోయిస్టులు ఇంజెక్షన్లు రెడీగా ఉంచుకున్నారని తెలిసి భద్రతా బలగాలు అవాక్కవుతున్నాయి.
గుట్టపై పట్టు చిక్కేనా?
కర్రెగుట్టల కింది భాగంలో భారీ స్థాయిలో ల్యాండ్ మైన్స్ ఫిక్స్ చేసి.. గుట్టల్లో మావోయిస్టులు తలదాచుకున్నారు. మోస్ట్ వాంటెడ్ హిడ్మా కూడా అక్కడే ఉన్నాడని సమాచారం. వెంటనే వేలాది మంది బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టి లాక్ చేశారు. గ్రామాల్లోకి బయటి నుంచి ఆహార పదార్థాలు వెళ్లకుండా చెక్ పెట్టారు. ఒక్కో గ్రామాన్ని జల్లెడ పడుతూ.. గుట్టల్లో ముందుకు సాగుతున్నారు. ల్యాండ్ మైన్స్ టెన్షన్‌తో కూంబింగ్ స్లోగా సాగుతోంది. ఈలోగా హెలికాప్టర్లతో ఆకాశమార్గంలో నేరుగా గుట్ట అగ్రభాగంలో జవాన్లను ల్యాండ్ చేసి.. అక్కడో స్థావరం ఏర్పాటు చేశాయి భద్రతా బలగాలు. గుట్టపై జెండా ఎగరేసి.. ఇది మా అడ్డా అంటూ ఇండికేషన్ ఇచ్చాయి. అంటే, గుట్ట శిఖరంపై సోల్జర్స్ ఉన్నారు.. గుట్ట కింద భాగంలోనూ బలగాలు ఉన్నాయి. మధ్యలో మావోయిస్టులు తిరుగుతున్నారన్న మాట. ల్యాండ్ మైన్లను దాటుకుంటూ.. కర్రెగుట్టలకు రెండు వైపులా పైపైకి ఎగబాకుతున్నారు జవాన్లు. ఆ క్రమంలోనే ఓ ల్యాండ్ మైన్ పేలడం.. ఓ ఎన్‌కౌంటర్ జరగడం లేటెస్ట్ అప్‌డేట్స్.
హిడ్మా కోసమేనా ఇదంతా?
ఆపరేషన్ కగార్. 2026 మార్చి కల్లా దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనేది కేంద్రం టార్గెట్. అయితే, మోస్ట్ వాంటెడ్ హిడ్మా మాత్రం చిక్కడు దొరకడు టైప్‌లో తప్పించుకుంటూ భద్రతా బలగాలకు సవాళ్లు విసురుతున్నాడు. అతన్ని అడ్డులేకుండా చేస్తే.. ఇక మావోయిస్టులను దాదాపు ఫినిష్ చేసినట్టేననేది కేంద్రం లెక్క. అందుకే, ఆ హిడ్మా ప్రస్తుతం కర్రెగుట్టల్లోనే ఉన్నట్టు కన్ఫామ్ చేసుకుని ఇలా భారీ ఎత్తున స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. హెలికాప్టర్లు, డ్రోన్లతో సెర్చ్ చేస్తున్నారు. వెంటనే ఉలిక్కిపడిన ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలు.. కర్రెగుట్టల్లో కూంబింగ్ నిలిపివేయాలంటూ.. శాంతి చర్చలు జరపాలంటూ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు పీస్ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కేంద్రంతో మాట్లాడాలని కోరారు. అయితే, మావోయిస్టులతో శాంతి చర్చలకు నో ఛాన్స్ అంటూ కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇప్పటికే తేల్చి చెప్పేశారు. కర్రెగుట్టల్లో సెర్చ్ ఆపరేషన్ దూకుడుగా కొనసాగుతోంది. ల్యాండ్ మైన్స్, ఎండ వేడి రూపంలో ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. మావోయిస్టులు తప్పించుకునే ప్రయత్నంలోనే తాజా ఎన్‌కౌంటర్ జరిగిందా? అన్నల సమీపంలోకి బలగాలు వచ్చేశాయా? రేపోమాపో హిడ్మా దొరికిపోతాడా? ఆల్రెడీ అతను తప్పించుకున్నాడా? ఇలా అనేక సందేశాలు.