Google Pixe 10| గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ త్వరలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ఎక్స్‌ఎల్, పిక్సెల్ 10 ఎక్స్‌ఎల్ ప్రో, పిక్సెల్ 10 ఫోల్డ్ మోడల్స్ ఉంటాయి. గత సంవత్సరం పిక్సెల్ 9 సిరీస్‌కు అప్‌గ్రేడ్‌గా ఈ కొత్త సిరీస్ రానుంది. టిప్‌స్టర్ షిషిర్‌షెల్కే1 తన ఎక్స్ హ్యాండిల్‌లో పిక్సెల్ 10 కొన్ని ముఖ్య ఫీచర్లను వెల్లడించాడు. ఈ ఫోన్ కొత్త డిజైన్‌తో పాటు ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. ఇది ఈ సిరీస్‌కు ప్రత్యేకతను జోడిస్తుంది.
పిక్సెల్ 10 ఫీచర్లు:
పిక్సెల్ 10లో 6.3-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే ఉంటుంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ గూగుల్ లేటెస్ట్ టెన్సర్ G5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB లేదా 12GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 48MP మెయిన్ లెన్స్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10.8MP పెరిస్కోప్ లెన్స్. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో అనేక కస్టమైజేషన్ ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటరీ 4,970mAh స్థాయిలో ఉంటుంది, ఇది 29W వైర్డ్ మరియు 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ ప్రో ఎక్స్‌ఎల్ ఫీచర్లు:
పిక్సెల్ 10 ప్రో, ప్రో ఎక్స్‌ఎల్‌లో వరుసగా 6.3-అంగుళాల, 6.8-అంగుళాల LTPO డిస్‌ప్లేలు ఉంటాయి. ఇవి 1 నుండి 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తాయి. ఈ ఫోన్‌లు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కలవు. రెండు మోడల్స్ టెన్సర్ G5 చిప్‌సెట్‌తో 16GB RAMను కలిగి ఉంటాయి. స్టోరేజ్ ఆప్షన్లలో పిక్సెల్ 10 ప్రోకు 128GB, 256GB, 512GB, 1TB ఉంటాయి. అయితే 1TB ఆప్షన్ అన్ని రంగుల్లో లభించకపోవచ్చు. ప్రో ఎక్స్‌ఎల్‌లో అయితే 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్లు ఉంటాయి.
కెమెరా సెటప్‌లో 50MP మెయిన్ సెన్సార్, 48MP అల్ట్రావైడ్, 48MP 5x టెలిఫోటో లెన్స్‌లు ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 42MP ఉంటుంది. అల్ట్రావైడ్, టెలిఫోటో లెన్స్‌లు మాక్రో ఫోటోగ్రఫీని సపోర్ట్ చేస్తాయి. టెలిఫోటో లెన్స్ 10cm దూరంలో అల్ట్రావైడ్ 2cm దూరంలో ఫోకస్ చేయగలదు. బ్యాటరీ విషయంలో, పిక్సెల్ 10 ప్రోలో 4,870mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో వేపర్ ఛాంబర్ కూడా ఉండడం విశేషం. ప్రో ఎక్స్‌ఎల్‌లో 5,200mAh బ్యాటరీ ఉంటుంది. ఇది పిక్సెల్ ఫోన్‌లలో అతిపెద్ద బ్యాటరీ. ఛార్జింగ్ స్పీడ్‌లు ప్రోకు 29W, ప్రో ఎక్స్‌ఎల్‌కు 39W వైర్డ్ రెండింటికీ 15W వైర్‌లెస్ (Qi2 టెక్నాలజీ) ఉంటాయి.
Also Read: మీ వద్ద పాత ఐఫోన్‌లు ఉన్నాయా? ఈ మోడల్స్‌కు కోట్లలో రిసేల్ విలువ!
పిక్సెల్ 10 సిరీస్ ఆగస్టు 2025లో లాంచ్ కానుంది. ఇది టెన్సర్ G5 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16తో అత్యాధునిక AI ఫీచర్లను అందిస్తుంది. చివరగా ఇక ధరల విషయానికి వస్తే.. పిక్సెల్ 10కి రూ. 80,000 నుండి రూ. 85,000, ప్రో మోడల్స్‌కు రూ. 99,999 నుండి రూ. 1,39,990 వరకు ఉండవచ్చు. కొత్త కెమెరా సెటప్, శక్తివంతమైన ప్రాసెసర్, ఆకర్షణీయ డిజైన్‌తో ఈ సిరీస్ గూగుల్ ఫ్యాన్స్‌కు ఆసక్తికరమైన ఆప్షన్ గా నిలుస్తుంది.