Kavitha – KTR : చాలా సింపుల్. గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకుంటున్నారు. కవిత రాసిన లేఖ.. కారు పార్టీలో కలకలం రేపింది. తెలంగాణ రాజకీయాన్ని రంజుగా మార్చేసింది. లేఖలో అంత ఇంట్రెస్టింగ్ మేటర్ ఏమీ లేదు. అంతా సో సో గానే ఉంది. కానీ, ఆ లేఖ లీక్ కావడమే ఇంట్రెస్టింగ్ మేటర్. విదేశాల నుంచి కవిత ల్యాండ్ కావడంతో అంతకుమించి డ్రామా మొదలైంది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన కామెంట్స్ చేశారు. పార్టీలో కోవర్టులంటూ కాక రేపారు. ఆ దెయ్యం ఎవరు? ఆ కోవర్ట్ ఎవరు? అంటూ కారు కుదుపులకు లోనైంది. కట్ చేస్తే.. ప్రెస్‌మీట్‌తో కేటీఆర్ మీడియా ముందుకొచ్చాడు. కవిత కాంమెంట్స్‌పై క్లారిటీ కానీ, రివర్స్ అటాక్ కానీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ.. సింపుల్‌గా సైడ్ అయిపోయారు. పైపై మాటలతో ముఖం చాటేశారు. అంటే..? కుటుంబంలో ఏదో జరుగుతోందనేగా..? అన్నాచెల్లి మధ్య ఏదో పెద్ద గొడవ ఉందనేగా..? అంటున్నారు.
కేటీఆర్ సింపుల్ రియాక్షన్
పార్టీ అధ్యక్షులకు ఎవరైనా లేఖ రాయొచ్చు.. అభిప్రాయాలు చెప్పొచ్చు.. మా పార్టీలో ఓపెన్ కల్చర్ ఉందంటూ చాలా లైట్ మోడ్‌లో కేటీఆర్ మాట్లాడారు. అయితే, అంతర్గత వ్యవహారాన్ని అంతర్గతంగానే మాట్లాడాలంటూ ఓ చురక అంటించారు. పార్టీలో అందరం కార్యకర్తలమే అన్నారు. అంటే.. కవిత సైతం ఓ సాధారణ కార్యకర్త మాత్రమేనని చెప్పకనే చెప్పారు. కవిత చేసిన కోవర్టుల టాపిక్‌పైనా సింపుల్ రియాక్షనే ఇచ్చారు. అన్ని పార్టీల్లో కోవర్ట్స్ ఉంటారని.. మా పార్టీలో సైతం రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండొచ్చని.. వాళ్లెవరో ముందుముందు బయటపడొచ్చంటూ చెప్పుకొచ్చారు. అంతే. ఇంతకంటే పెద్దగా ఏం మాట్లాడలే.
ఆ దెయ్యాలు ఎవరు?
కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయనేది కవిత చేసిన మెయిన్ అలగేషన్. దానికి కేటీఆర్ నుంచి ఆన్సర్ లేదు. ఆ దెయ్యం కేటీఆరే అంటూ కాంగ్రెస్ వాళ్లు, సోషల్ మీడియా వాళ్లు తెగ రెచ్చిపోతుంటే.. కేటీఆర్ మాత్రం ఆ టాపికే ఎత్తకుండా సైడ్ చేసేశారు. గులాబీ బాస్ 24 బై 7 ఫామ్‌హౌజ్‌లోనే ఉంటారు. ఆయన దగ్గరికి ఎవరికీ యాక్సెస్ ఉండదు. బాస్ పిలిస్తేనే వెళ్లాలి కానీ, ఎవరైనా వెళ్లాలనుకుంటే కుదరదు. అది గద్దర్ అయినా, పార్టీ ప్రముఖుడైనా. ఎనీ టైమ్ కేసీఆర్‌కు కలవగలిగేది ఇద్దరే ఇద్దరు. ఒకరు కేటీఆర్, మరొకరు సంతోష్‌రావ్. మరి, కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయనే ఆరోపణ కవిత ఎవరిపై చేసినట్టు..?
లేఖ లీక్ చేసిందెవరు?
కవిత తన మాటల్లో అనేక లాజిక్ పాయింట్స్ ప్రస్తావించారని అంటున్నారు. కేసీఆర్ కూతురునైన తాను రాసిన లేఖ బయటకు రావడం మామూలు విషయమా? అది కోవర్టుల పనే అన్నారు. నిజమే. కూతురు తండ్రికి రాసిన లెటర్ లీక్ కావడం అనుమానించదగినదే. ఆ లేఖ గురించి.. కేసీఆర్, కవితలకు మాత్రమే తెలియాలి. లేదంటే కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావులకైనా తెలిసే ఛాన్స్ ఉంది. అంతే. బయటివారికి నో ఛాన్స్. మరి, లేఖ లీక్ అయిందంటే.. వీరిలోనే ఎవరో ఒకరు ఆ పని చేసి ఉండాలి? అది ఎవరు? ఆ కోవర్ట్ ఎవరు?
Also Read : ప్రకాశ్‌రాజ్ బుదరలో పంది.. షాకింగ్ పోస్ట్..
కవిత మరో షర్మిల అవుతారా?
ఎయిర్‌పోర్టులో కవిత అంత సీరియస్ నోట్‌లో మాట్లాడితే.. ప్రెస్‌మీట్‌లో కేటీఆర్ మాత్రం చాలా లైట్ మోడ్‌లో రియాక్షన్ ఇవ్వడం రాజకీయ ఊహాగానాలకు మరింత ఛాన్స్ ఇస్తోంది. కల్వకుంట్ల కుటుంబంలో పెద్ద కుమ్ములాటనే సాగుతోందని డౌట్ పడుతున్నారు. అది ఆస్తుల కోసమా? రాజకీయ వారసత్వం కోసమా? అనేది ముందుముందు తెలియొచ్చు. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నట్టుగా.. కవిత మరో షర్మిలగా మారుతారా?