Lizard in Samosa: రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక స్వీట్ షాప్‌లో స్కూలు విద్యార్థులు కొన్న సమోసాలో బల్లి కనిపించడంతో ఆహార భద్రతపై ఆందోళనలు తలెత్తాయి. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మొయినాబాద్‌లోని ఓ ప్రముఖ స్వీట్ షాప్ లో ఇద్దరు పిల్లలు సమోసాలు కొన్నారు. వారు ఒక సమోసాను తిన్న తర్వాత, రెండో సమోసాను తుంచి చూడగా.. అందులో బల్లి ప్రత్యక్షమైంది. ఆ తర్వాత కాసేపటికే ఇద్దరు పిల్లలు వాంతులు చేసుకున్నారు. గమనించిన తల్లిదండ్రులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న షాప్ యజమాని వెంటనే దుకాణాన్ని మూసివేసి అక్కడ నుంచి జంప్ అయ్యాడు. దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు ఇలాంటి ఫుడ్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బయట ఫుడ్ తినాలంటేనే భయంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. మరి కొంత మంది నెటిజన్లు రైల్వే స్టేషన్ లో దొరికే ఫుడ్ లో ఏ మాత్రం నాణ్యతగా ఉండడం లేదని.. తినలేక పోతున్నామని రాసుకొచ్చారు. ‘మంచి మాటలు ఎవరు వినరు.. బేకార్ ఫుడ్ ఐటెమ్స్ సమోసా, చిప్స్ అసలు తినొద్దని చెబుతున్నా అలానే తింటున్నారు’ అని మరికొంత చెప్పుకొచ్చారు.
ALSO READ: Weather News: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం.. జాగ్రత్త
విషయం తెలిసిన స్థానికులు ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన ఆహార పరిశ్రమలో పరిశుభ్రత ప్రమాణాలపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. మొయినాబాద్ లో వ్యవసాయం, విద్యా సంస్థలు, పర్యాటక క్షేత్రాలకు ప్రసిద్ధమైన ప్రాంతం. ఈ ఘటన స్థానిక దుకాణాలలో నాణ్యతా నియంత్రణ అవసరాన్ని తెలియజేస్తుంది..
ALSO READ: CM Revanth Reddy: ఒక్కో తప్పుచొప్పున కేసీఆర్‌ను వంద కొరడా దెబ్బలు కొట్టాలి: సీఎం రేవంత్
సమోసాలో బల్లి ప్రత్యక్షం కావడంతో స్థానికంగా ఆహార భద్రత, పరిశుభ్రతపై చర్చలకు దారితీసింది. అధికారులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని, షాప్‌పై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పరిశుభ్రత పాటించని షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.