E-Paper
Advertisement

ఒక్క వ్యక్తిని కాపాడేందుకే ఈ తాపత్రయమా? కేంద్ర ఎన్నికల సంఘంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఒక్క వ్యక్తిని కాపాడేందుకే ఈ తాపత్రయమా? కేంద్ర ఎన్నికల సంఘంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

KTR- Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: భారత రాజ్యాంగం కంటే గొప్పది ఏదీ లేదని, ఈ దేశంలో ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కునూ లాక్కునే అధికారం ఎవరికీ లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వ్యవస్థల కంటే వ్యక్తులు ఎన్నడూ గొప్పవారు కారని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన బాధ్యతల నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా శుక్రవారం పేర్కొన్నారు. ‘ఈ దేశం ఎందరో వ్యక్తులను చూసింది, ఎందరో వచ్చారు.. పోయారు. వాటన్నింటినీ తట్టుకుని భారతదేశం ఎంతో బలంగా నిలబడింది, సగర్వంగా ముందుకు సాగుతోంది. అలాంటిది వ్యవస్థలను పక్కనపెట్టి, ఒక్క వ్యక్తిని కాపాడటానికి ఇంతటి తాపత్రయం ఎందుకు?’ అని కేటీఆర్ నిలదీశారు.

సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర దర్యాప్తు

Advertisement

140 కోట్ల మంది భారతీయుల ప్రాథమిక హక్కుల కంటే ఆ ఒక్క వ్యక్తి ఎలా గొప్పవాడయ్యాడని ఆయన ప్రశ్నించారు. దేశ మూల సిద్ధాంతాలను, ఆత్మను తుంగలో తొక్కుతూ సమాంతర వ్యవస్థలను నిర్మించాలని చూసే వారికి కాలం చెల్లిందని హెచ్చరించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో జరిగిన తీవ్ర అక్రమాలు, అవకతవకలపై భారత అత్యున్నత న్యాయస్థానం స్పందించాలని కోరారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ పునరుద్ఘాటించారు.

మాజీ మంత్రి హరీష్ రావు 

Advertisement

ప్రజల్లో విశ్వసనీయతను కాపాడలేకపోతే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్ చేశారు.కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు, స్వతంత్రతపై శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు.ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి వెన్నెముక.. అధికారంలో ఉన్నవాళ్లకు రక్షణ కవచం కాదన్నారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయినప్పుడు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు.. సీఈసీ పదవికి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలపి డిమాండ్ చేశారు.

జ్ఞానేష్.. ఇట్స్ డన్ బ్రో!

ఓటర్ల హక్కులను కాలరాస్తే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమారే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈసీ స్వతంత్రత, నియామకాలపై అనుమానాలు రావడం మన రాజ్యాంగ ప్రజాస్వామ్యానికే పెను ముప్పు అని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన పౌరుల నుంచి లాక్కునే హక్కు ఎవరికీ లేదన్నారు. ఆర్టికల్స్ 324, 325, 326 సహా ప్రజాప్రాతినిధ్య చట్టాల ప్రకారం ఎన్నికల వ్యవస్థ పూర్తిగా నిష్పాక్షికంగా, పారదర్శకంగా పనిచేయాలన్నారు. వ్యక్తులు, ప్రభుత్వాల కంటే కూడా ప్రజాస్వామ్యమే అత్యున్నతమైనది, గొప్పది అన్నారు. ‘జ్ఞానేష్ ఇట్స్ డన్ బ్రో’ అంటూ సీఈసీ వైఖరిని ఎండగట్టారు.

Also Read: పోలవరం ఎమ్మెల్యేపై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు హైలెవెల్ కమిటీ ఏర్పాటు!

Tags

Related News

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సర్కార్ మరో సంచలన నిర్ణయం!

తెలంగాణలో తుది ఓటరు జాబితా విడుదలకు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ఎల్‌నినో ఎఫెక్ట్.. రాష్ట్రంలో కరువు ఛాయలు.. ఈనెల 12న మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ!

ఎస్‌ఆర్ నగర్ శిరీష మర్డర్ కేసులో బిగ్ ట్విస్.. నిందితుడి బిజినెస్ చూసి షాకైన పోలీసులు!

మీ పిల్లలు డ్రగ్స్‌కు బానిసలయ్యారా.. భయపడకుండా ఇలా చేయండి?

లండన్‌కు మీనాక్షి నటరాజన్.. తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంచార్జ్ ఎవరు?

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. 22-ఎ భూములపై ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Big Stories

Advertisement
×