BigTV English

KTR : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..

KTR : తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం డిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం గట్టిగా కొట్లాడితే విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.

KTR : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..

KTR : తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం బలంగా ఉండాల్సిందేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం గట్టిగా కొట్లాడితే విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.


బీఆర్ఎస్ కు ఎన్నికల్లో గెలుపోటములు కొత్తేమీ కాదని కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక మాట దాటేస్తోందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ఉపముఖ్యమంత్రి భట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. అప్పులు, శ్వేత పత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. పేదల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.

దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, ఇతర సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తే ఆయా లబ్ధిదారులతో బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. రైతుబంధు ఇవ్వకుండా ప్రభుత్వం మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీలో మార్పులు చేర్పులను కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×