Mancherial ACB: అధికారికంగా సాయం చేసేందుకు లంచం తీసుకున్న గ్రామ పరిపాలనా అధికారితోపాటు అతనికి సహకరించిన ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జల్లా భీమిని మండలం పెద్దపేట గ్రామ పరిపాలనా అధికారిగా దుర్గాప్రసాద్ పని చేస్తున్నాడు.
కొన్నిరోజుల క్రితం ఓ వ్కక్తి తన పేరన బదిలీ అయిన భూమికి సంబంధించి పట్టాదారు పాస్ బుక్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పని చేసి పెట్టటానికి దుర్గప్రసాద్ లక్షా 30వేలు లంచంగా డిమాండ్ చేశాడు. మొదటి ఇన్ స్టాల్ మెంట్ గా 80వేల రూపాయలు ఇవ్వాలని చెప్పాడు. పని పూర్తయ్యాక మిగితా 50వేలు ఇవ్వాలన్నాడు. దాంతో పట్టాదారు పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు.
Also read: శివాజీకి బిగ్ బాస్ కృష్ణుడు ఛాలెంజ్!
ఈ క్రమంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం దుర్గప్రసాద్ తనకు పరిచయం ఉన్న పోతు రాజేందర్ అనే వ్యక్తితో కలిసి డబ్బు తీసుకోవటానికి పెద్దపేట గ్రామ శివార్లకు బైక్ పై వచ్చాడు. డబ్బును పోతు రాజేందర్ కు ఇవ్వాలని చెప్పాడు. ఫిర్యాదు చేసిన వ్యక్తి డబ్బు తీసి పోతు రాజేందర్ కు ఇవ్వగానే దాడి చేసిన ఏసీబీ అధికారులు అతనితోపాటు దుర్గప్రసాద్ ను అరెస్ట్ చేశారు. ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.
Also read: రిహాబ్‌కు తీసుకెళ్లాల్సిన కుర్రాడితో చిక్కుల్లో… ఇద్దరు డ్రైవర్ల జర్నీ ఫుల్ రచ్చ… కామెడీ ఎంటర్‌టైనర్