Fire Accident: పాతబస్తీలోని మహారాజ్ గంజిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోదాంకు అంటుకున్నాయి. ప్రమాద టైంలో ఇంట్లో ఉన్న ఏడుగురిని ఫైర్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. వారిలో ఒక నెల వయసు ఉన్న చిన్నారి కూడా ఉంది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తులో ఈ ప్రమాదం జరగడంతో.. 3 అంతస్థులకు మంటలు వ్యాపించాయి. భారీ మంటల ఎగిసిపడడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో ఈ ఆపరేషన్ చేశారు. అందులో దాదాపు మూడు కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో చిక్కుకున్న రెండు కుటుంబాలకు.. చెందిన ఏడుగురిని ఫైర్ ఫైటర్స్ కాపాడారు. అందులో నెల వయసు గల చిన్నారి కూడా ఉంది.
ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కావడంతో.. వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అదే భవనంలో ప్లాస్టిక్ గోదాం ఉండటంతోనే మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. ఇంకా మంటల్లో ఎవరైనా ఉన్నారా కొంతమంది లోపలికి వెళ్లి సమీక్షించారు. భారీ ల్యాడర్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
రజినీకాంత్ సినిమా రోబో చూశారుగా.. అందులో రోబో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నవారిని ప్రాణాలతో కాపాడుతుంది. అచ్చు అలాంటి రోబో ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఫైర్ ఫైటర్ రోబోట్‌గా పిలిచే.. ఈ రోబో అగ్ని ప్రమాదాల్లో కీలకంగా పనిచేయనుంది. మంటలు ఆర్పడం.. ప్రాణాలు కాపాడడం.. దీని ప్రత్యేకత.. భారీ అగ్నిప్రమాదాలు సంబవించినపుడు సిబ్బంది చేరుకోలేని ప్లేస్‌కు ఈ రోబోట్‌ను పంపించి మంటలను అదుపు చేస్తారు. పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదానికి ఇదే ఉపయోగించినట్లు తెలుస్తోంది.
Also Read: కాచీగూడకు వెళ్తున్న రైలులో మంటలు
ఇదిలా ఉంటే.. మేడ్చల్ ఐఐటీ కోచింగ్ సెంటర్ వద్ద ఓ ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. మైలారం నుండి కొంపల్లికి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు ఆపి దిగిపోయాడు. పూర్తిగా దగ్ధమైన బస్సులో ఎవర లేకపోవడంతో భారీ ప్రమాదం తిప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాక్‌సర్కూట్ వల్లే బస్స్‌లో మంటలు చెలరేగాయని డ్రైవర్ తెలిపాడు..పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.