E-Paper
Advertisement

Osmania University : పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం.. అర్ధరాత్రి బాత్రూమ్‌లోకి చొరబడిన ఆగంతకులు..

Osmania University : పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం.. అర్ధరాత్రి బాత్రూమ్‌లోకి చొరబడిన ఆగంతకులు..
Advertisement

Osmania University : సికింద్రాబాద్ పీజీ గర్ల్స్ హాస్టల్లో శుక్రవారం అర్ధరాత్రి అలజడి రేగింది. ఫుల్లుగా గంజాయి తాగిన ఇద్దరు ఆగంతకులు హాస్టల్‌లోకి చొరబడ్డారు. బాత్రూమ్ దగ్గరకు చేరి సైగలు చేయడంతో విద్యార్థినులు కేకలు వేశారు. దీంతో హాస్టల్‌లోని మిగతా స్టూడెంట్స్ అలర్టయ్యారు. అందరూ కలిసి ఓ ఆగంతకుడిని పట్టుకున్నారు. మరొకడు పారిపోయాడు. తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. అర్ధరాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

గంజాయి మత్తులో యువత చెడు దారిలో నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పలుచోట్ల గంజాయి, డ్రగ్స్‌ను పట్టుకొని, వాటిని సరఫరా
చేసే ముఠాను అరెస్ట్ చేశారు. ఒక వైపు అరెస్టుల పర్వం కొనసాగుతున్నా.. గంజాయి అమ్మకాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ పీజీ గర్ల్స్ హాస్టల్లోకి ఆగంతకులు చొరబడడంతో విద్యార్ధినిలు, వారి కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు.

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×