EPAPER

Seethakka: కేటీఆర్.. నువ్వు మగాడివైతే.. రెచ్చిపోయిన సీతక్క

Seethakka: కేటీఆర్.. నువ్వు మగాడివైతే.. రెచ్చిపోయిన సీతక్క

Minister Seethakka Fire on KTR Remarks against Konda Surekha: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘మా నోళ్లను ఫినాయిల్ తో కడగాలని మాట్లాడిన కేటీఆర్ కుసంస్కారి. ఎంగిలి పూల బతుకమ్మ రోజే కేటీఆర్ గలీజ్ మాటలు వినాల్సి రావడం దురదృష్టకరం. బతుకమ్మ పండుగ తొలిరోజే కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి మరోసారి కేటీఆర్ తన నైజాన్ని చాటుకున్నాడు. మహిళల పట్ల ఆ విధంగా మాట్లాడిన కేటీఆర్ నోటినే యాసిడ్ తో కడగాలి. మహిళలను, మహిళా నేతల వ్యాఖ్యలను కించపరచడం కేటీఆర్ కు ఫ్యాషనైపోయింది. బస్సులో మహిళలకు ఫ్రీ జర్నీ విషయమై కూడా కేటీఆర్ ఇష్టానుసారంగా, అవమానకరంగా మాట్లాడారు. ఇప్పుడు ఎంగిలిపూల బతుకమ్మ రోజు మరోసారి అవమానకరంగా మాట్లాడారు. ఖచ్చితంగా మహిళలు కేటీఆర్ కు రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతారు. దొర అహంకారాన్ని కేటీఆర్ మరోసారి చాటుకున్నారు. కేటీఆర్.. నాలుగు గోడల మధ్య మాట్లాడడం కాదు.. నీకు ధైర్యముంటే బహిరంగంగానే మాట్లాడు. దూషణలకు, బూతులకు బ్రాండ్ అంబాసిడరే కేటీఆర్. సొంత పార్టీకి చెందిన సోషల్ మీడియాను కట్టడి చేయాలన్న సభ్యత, సోయి కేటీఆర్ కు లేదు. ఇకనైనా మీ తీరును మార్చుకోండి. లేకపోతే మీ తీరు వల్ల చివరకు మీ కుటుంబ సభ్యులే తల దించుకోవాల్సి వస్తుంది’ అంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు.


Also Read: కేటీఆర్.. తప్పు నీదే.. కొండా సురేఖకు క్షణాపణలు చెప్పు: జగ్గారెడ్డి

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో గత రెండు రోజులుగా సోషల్ మీడియా ట్రోలింగ్ పాలిటిక్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఈ వార్ నడుస్తోంది. సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెడుతున్నారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై అవమానకరంగా పోస్టులు పెట్టారంటూ మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, కేసీఆర్.. మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కేటీఆర్.. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా..? ఉంటే వాళ్లకు ఈ పోస్టులను చూపించు.. అప్పుడు వాళ్లు ఏ విధంగా స్పందిస్తారో చెప్పండి అంటూ మంత్రి కంటతడి పెట్టారు.


Also Read: ట్రోలింగ్‌పై మళ్లీ స్పందించిన ఎంపీ రఘనందన్‌రావు.. ఈసారి ఏమన్నారంటే..?

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇటు కేటీఆర్ కూడా స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖ గారివి.. దొంగఏడుపులు.. పెడబొబ్బలన్నారు. గతంలో కూడా తమపై కొండా సురేఖ ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. తమపై ఆరోపణలు చేసేముందు కొండా సురేఖ గతంలో తాను మాట్లాడిన బూతు మాటలను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిదన్నారు. అప్పుడు మీ వ్యాఖ్యలతో మా ఇంట్లో ఉన్న ఆడవాళ్లు బాధపడరా..? వాళ్లకు మనసు లేదా? అంటూ కొండా సురేఖను కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇష్టానుసారంగా బుతులు మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ ఫైరయ్యారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి నోరును కొండా సురేఖ, మంత్రులు ఫినాయిల్ తో కడగాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్ర సీతక్క స్పందిస్తూ పై విధంగా మాట్లాడుతూ కేటీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Related News

TSPSC Group 1: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్ కొట్టివేత!

jagital: మంత్రగాళ్లారా.. తస్మాత్ జాగ్రత్త.. చంపేస్తున్నాం.. పోస్టర్ల కలకలం!

Kishan Reddy on BRS: నేవీ రాడార్ కేంద్రంపై రచ్చ.. కేటీఆర్‌పై మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం.. కేసీఆర్ వద్ద ఆందోళన చేయాలంటూ..

Damodar Raja Narasimha: బీఆర్ఎస్‌పై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం.. పదేళ్లలో ఏం చేశారు? కాగితాలకే పరిమితమా?

Brs Approved For Radar Station : అప్పట్లోనే రాడార్ స్టేషన్’కు బీఆర్ఎస్ అనుమతి… ఇప్పుడేమో ?

CM Revanth Reddy: మొన్న పథకాలు.. నిన్న ఉద్యోగాల జాతర.. నేడు పెట్టుబడుల సాధన.. ఇదీ సీఎం రేవంత్ మార్క్ పాలన

Gaddar Awards: మన సినీ పరిశ్రమ ప్రపంచాన్ని శాసించాలి, గద్దర్ అవార్డుల భేటీలో భట్టి కీలక వ్యాఖ్యలు

Big Stories

×