BigTV English

Pawan Kalyan Varahi Sabha : రేపటి వారాహి సభలో పవన్ ఏం చెప్పనున్నారు ? అందరిలోనూ ఒకటే ఉత్కంఠ

Pawan Kalyan Varahi Sabha : రేపటి వారాహి సభలో పవన్ ఏం చెప్పనున్నారు ? అందరిలోనూ ఒకటే ఉత్కంఠ

Varahi Book Key Factors Will Be Revealed Tomorrow By Pawan Kalyan : వారాహి డిక్లరేషన్‌లో ఏం రాశారు ? పవన్ కల్యాణ్ ఏం చెప్పనున్నారు ? సనాతన ధర్మ పరిరక్షణ కోసమే జనసేన అధినేత కదిలాడా ? గత ప్రభుత్వ తప్పులను పరిష్కరించడమే ఆయన ఎజెండానా ? అసలు కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటి ? హిందుత్వ ఎజెండాలో జనసేన ఒంటరిగానే ముందుకుపోతోందా ? శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం నుంచి బయటకు వచ్చిన పవన్ వారాహి డిక్లరేషన్ ను రిలీజ్ చేశారెందుకు ?


గురువారం తిరుమలేశుడ్ని దర్శించిన పవన్, ప్రాయశ్చిత దీక్షను విరమించారు. అనంతరం తిరుపతి వారాహి సభ గురించి చెప్పారు. ఇందులో భాగంగానే డిక్లరేషన్ బుక్ గురించి బుధవారం ప్రకటించనున్నట్లు చెప్పారు.

మంగళవారం రాత్రికే అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు పవన్. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తన ఇద్దరు కుమార్తెలైన ఆద్య కొణిదెల, కుమారి పొలెనా అంజలిలతో కలసి మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు.


also read : వైసీపీకి ఛాన్స్ ఇవ్వలేదు.. తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ డిక్లరేషన్

అనంతరం వారాహి డిక్లరేషన్‌ పుస్తకాన్ని శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నపవన్, అనంతరం ఆలయం వెలుపల మీడియాకు చూపించారు. గురువారం వారాహి సభ ఉందని, అందులో భాగంగానే బుక్‌లో పొందుపర్చిన అంశాలను వివరించనున్నారు.

ఇవాళ రాత్రికి తిరుమలలోనే జనసేనాని బస చేయనున్నారు. కొండ మీద నుంచి రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అనంతరం ఐదున్నర గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వారాహి సభలో పాల్గొననున్నారు. హిందూయిజం గురించి కీలకమైన విషయాలను సభలో భాగంగా పవన్ వెల్లడించే అవకాశం ఉంది.

మరోవైపు పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది సినీ పరిశ్రమల్లోనూ పవన్ కల్యాణ్ కు మంచి పట్టుంది. అక్కడా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది.

హిందూ సాంప్రదాయం విషయంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ ఆయన ప్రభావం చూపించనున్నారు. ఒకవేళ పవన్ కార్యచరణతో హిందూ ప్రజలు కదిలొస్తే, దక్షిణాదిలో బలమైన హిందూ లీడర్ గా పవన్ సరికొత్తగా అవతరించే అవకాశం లేకపోలేదు.

Related News

Nellore Ysrcp: కాకాణి రాకతో మారిన నెల్లూరు రాజకీయం.. జిల్లాపై పెత్తనం ఎవరిదంటే?

Nidigunta Aruna: ఇంతకీ అరుణ ఏ పార్టీ? తేలు కుట్టిన దొంగల్లా నేతలు

Vijayawada Loan Scam: బెజవాడలో కిలాడీ లేడీ.. లోన్లు ఇప్పిస్తానని రెండువేల మందికి టోకరా

Bhavani Rapido Success: భర్త అనారోగ్యం.. రాపిడో బైక్‌తో అండగా భవానీ.. ట్వీట్ చేసిన టిడిపి!

AP Govt decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ గ్రామాలపై బిగ్ ప్లాన్.. అదేమిటంటే?

India pension plan: 60 ఏళ్ల తర్వాత కూడా టెన్షన్ ఫ్రీ.. ఈ సూపర్ స్కీమ్ మీకు తెలుసా!

Big Stories

×