MLA Mallareddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్కూటర్ పై పాలు అమ్ముతూ సందడి చేశారు. తన పాత రోజులను గుర్తు తెచ్చుకున్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి వెళ్లారు. అక్కడ పాల డబ్బాతో కనిపించిన స్కూటర్ పై ఎక్కి కూర్చొన్నారు. ఇంకేముంది.. ఇక చకచకా ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆ వీడియో వైరల్ అవుతోంది.
బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు సోషల్ మీడియాలో తెగ ఫ్యాన్ ఫాల్లోయింగ్ ఉంది. గతంలో పాలమ్మినా… పూలమ్మినా.. కష్ట పడ్డా.. సక్సెస్ అయినా.. మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ యూట్యూబ్ లో మస్త్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్ లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ మల్లారెడ్డి పాల డబ్బాతో కనిపించిన స్కూటర్ కనిపించింది. వెంటనే తన పాత గుర్తుకు తెచ్చుకున్న మల్లారెడ్డి స్కూటర్ పై ఎక్కి కూర్చున్నారు. పాల బండిని చూడగానే తనకు పాత రోజులు గుర్తుకు వచ్చి అలా చేశారంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు.
ఇక, పాలబండి ఎక్కిన మల్లారెడ్డి ఏముంది చకా చక ఫోటోలకు పోజులిస్తూ సందడి వాతావరణం సృష్టించారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఆ వీడియోపై రక రకాలుగా కామెంట్ చేస్తున్నారు. మల్లారెడ్డి మల్ల గిట్ల పాలు అమ్ముతున్నారా..? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మల్లారెడ్డి పాలు అమ్మిన, పూలు అమ్మిన డైలాగ్ అందరికీ సుపరిచితమే. స్కూటర్‌పై పాలమ్మే స్థాయి నుంచి ఎన్నో విద్యా సంస్థలు, వ్యాపారాలతో ఆయన పై స్థాయికి ఎదిగారు. గతంలో తెలంగాణ మంత్రిగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే.
Also Read: BEL Recruitment: బీటెక్ అర్హతతో ఇంజినీర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 4 రోజులే ఛాన్స్..
ఒకప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అంటే ఆ హవా వేరే లెవల్‌లో ఉండేది.. ఎక్కడకి వెళ్లినా ఆయన చురుకుదనంతో ఇట్టే నవ్వులు పూయిస్తారు. 24/7 ఫుల్ జోష్‌లో ఉంటారు. మల్లారెడ్డి తెర మీద కనిపించినా.. ఆయన నోరు విప్పి మాట్లాడిన ఎదురుగా ఉన్నవారు నవ్వక తప్పదు. కాలేజ్ ఫంక్షన్‌లో డ్యాన్స్‌లు ఇలా సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపిన మల్లారెడ్డి.. ఇప్పుడు పొలిటికిల్ సీన్‌లో పెద్దగా కనిపించడం లేదు. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన ప్రసంగాలు అయితే యూట్యూబ్‌లో ఒకప్పుడు ట్రెండింగ్‌లో ఉండేవి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆయన గురించి తెలియని వారు ఉండరు. అంటే ఆయనకు ఎంత ఫాల్లోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అదే మల్లన్న ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. తాజాగా ఈ రోజు పాల బండిపై ఇలా కనిపించి మల్లారెడ్డి పాత జోష్ లో కనిపించారు. మల్లారెడ్డి ఎప్పుడూ ఇదే జోష్ లో కనిపిస్తూ సందడి చేయాలని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.