BigTV English

MLC Kavitha: అమెరికాకు కవిత వెనుక గుసగుసలు.. సడన్‌గా వెళ్లడం వెనుక

MLC Kavitha: అమెరికాకు కవిత వెనుక గుసగుసలు.. సడన్‌గా వెళ్లడం వెనుక

MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీలో లీడర్ షిప్ ఫైటింగ్ ఎంతవరకు వచ్చింది? కావాలనే ఎమ్మెల్సీ కవితను సైడ్ చేశారా? కనీసం ఆమెకు ఏ పోస్టు ఇవ్వమని తెగేసి చెప్పేశారా? జరుగుతున్న పరిణామాలు పార్టీని డ్యామేజ్ చేస్తుందని భావించారా? అందుకే కవిత ఎకాఎకీన అమెరికాకు పంపించారా? అవుననే సంకేతాలు గులాబీ పార్టీ నుంచి బలంగా వినిపిస్తున్నాయి.


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం రాత్రి అమెరికాకు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి ఆమె వెంట కొందరు నేతలు వచ్చారు. కొడుకు గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు ఆ పార్టీ వర్గాల మాట. కవిత ఫారెన్ టూర్‌కు ఢిల్లీ సీబీఐ స్పెషల్ కోర్టు అనుమతి మంజూరు చేసింది. కనీసం అనుచరులకు ఫారెన్ వెళ్తున్నట్లు కవిత చెప్పలేదని సమాచారం. ఇంత సడెన్‌గా వెళ్లడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు.

అంతకుముందు ఏం జరిగింది? శుక్రవారం రాత్రి హరీష్‌రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారు. ప్రస్తుతం హరీష్‌రావు ఫాదర్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో బావాబావమరుదుల మధ్య కవిత విషయం ప్రస్తావనకు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


తమ పార్టీ ఇప్పటికీ బలంగా ఉందని, ఫ్యామిలీ సమస్యల వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయని చర్చించుకున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితను కొద్దిరోజులు హైదరాబాద్, మీడియా నుంచి దూరంగా ఉంచితే పరిస్థితులు సద్దుమణిగే అవకాశాలు ఉంటాయని మాట్లాడుకున్నారట. ఈ విషయాన్ని కవితకు చేరవేయడం, ఆమె వెంటనే అమెరికాకు బయలుదేరడం జరిగిపోయింది.

ALSO READ: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వడగళ్లతో కూడిన వానలు

పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై కొన్నాళ్లుగా కారు పార్టీలో అంతర్గత చర్చ జరిగింది.. జరుగుతోంది కూడా. కాకపోతే ఏ ఒక్కరూ ఈ విషయంపై బయట పడలేదు. తొలుత కేటీఆర్‌కు అధ్యక్షుడి పదవి అప్పగించి కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని భావించారట. అలాగైతే హరీష్‌రావు నుంచి ఇబ్బందులు వస్తాయని భావించారట.

ఈ క్రమంలో కవితను పక్కనపెట్టారని అంటున్నారు. ఈ విషయం తెలిసి అగ్గి మీద గుగ్గిలం అయ్యారట కవిత. కావాలనే తనను పార్టీ నుంచి పక్కనపెట్టారని రుసరుసలాడారు. పార్టీ పగ్గాలు కేటీఆర్‌కు అప్పగించినా కలిసి పని చేస్తానని మీడియా ముందు బయటపెట్టారు హరీష్‌రావు. ఈ విషయంలో కేసీఆర్ చెప్పిన లైన్ దానని స్పష్టంచేశారు.

ఫ్యామిలీ విషయాలు ఇక్కడ చర్చిస్తే మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తాయని, తద్వారా పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారు గులాబీ బాస్. ఈక్రమంలో కవితను అమెరికాకు పంపించారట. రేపోమాపో రేపో మాపో కేటీఆర్, కేసీఆర్ అమెరికా వెళ్తారని అంటున్నారు. అక్కడ సెటిల్ చేసుకుని వస్తారని అంటున్నారు.  రానున్న రోజుల్లో బీఆర్ఎస్ గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

Big Stories

×