Big Stories

MP Keshava Rao: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. రాజీనామా చేసిన ఎంపీ..?

MP Keshava Rao news todayMP Keshava Rao Resigned From BRS party(Telangana news live): లోక్ సభ ఎన్నికలకు ముందే కేసీఆర్ కు మరో భారీ షాక్ తగిలింది. వరుసపెట్టి ఒక్కో కీలక నేత కారు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ కె. కేశవరావు రాజీనామా చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన బీఆర్ఎక్ పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటుగా కేసీఆర్ కుటుంబంపై కూడా కేకే కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

త్వరలోనే రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కె. కేశవరావు గురువారం అధికారికంగా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరుబోతున్న ఆయన కేసీఆర్ కుటుంబంపై పలు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం టీఆర్ఎస్ కంటే ముందే తెలంగాణ కోసం ఆలించించిందని వెల్లడించారు. ఈ విషయంపై కాంగ్రెస్ ఫోరం ఫర్ ముందే ఆలోచనలు చేసిందని గుర్తుచేశారు.

- Advertisement -

బాగారెడ్డి చైర్మన్ గా సీఎఫ్ టీ ఏర్పాటు జరిగిందని.. అప్పుజే 42 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని సోనియాకు లేఖ రాశారని గుర్తు చేశారు. 1998లో మొదలైన తెలంగాణ ఉద్యమం కోసం ఆరు కమిటీలు ఏర్పాటైతే.. తాను అందులో ఒకడిగా ఉన్నానన్నారు. అయితే ప్రజల్లో మాత్రం కేసీఆర్ కుటుంబమే ముందుండి నడిపించిందనే భావన ఉందని పరోక్షంగా ఆయన కుటుంబంపై ఆరోపణలు చేశారు. కేసీఆర్ తనకు ఇచ్చిన గౌరవం మరచిపోలేనని అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కొన్ని సరిచేసుకోవాల్సిన అంశాలను ఇంకా సరిచేసుకోలేదన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News