E-Paper
Advertisement

Hostel Warden Negligence: కూరలో లివర్ మిస్సింగ్.. ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు

Hostel Warden Negligence: కూరలో లివర్ మిస్సింగ్.. ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు
Advertisement

Hostel Warden Negligence: స్వేఛ్చ బ్యూరో: ప్రభుత్వ వసతి గృహాల్లో నిలువెత్తు నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తమ సొంత ఇళ్లలో పెట్టినట్టుగానే హాస్టల్ లోనూ విద్యార్థులకు ఆహారం అందించాలని నెలలో మూడుసార్లు చికెన్, ఓసారి మటన్ నిబంధనను రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చింది. పిల్లలకు మెనూ ప్రకారం అందించాల్సిన ఆహారంపై అధికారుల నిఘా లేకపోవడంతో వార్డెన్లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. వంట చేసే కుక్ లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో పోషకాహారం సంగతి అటుంచితే బాలల అనారోగ్యం పాలవుతున్నారు. పేద వర్గాలకు చెందిన పిల్లలు చదువుకునేందుకు వసతి గృహాల్లో చేరితే వారికి చాలీచాలని ఆహారం పెట్టి చేతులు దులుపుకుంటున్న వైనం ఇనుగుర్తి మండల కేంద్రంలోని హాస్టల్లో నిదర్శనంగా నిలుస్తుంది.

వివరాల్లోకి వెళితే..

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని ఎస్సి బాలుర వసతి గృహంలో 60 మందికి పైగా వసతి గృహంలో ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యర్థిస్తున్నారు. వసతి గృహంలో సరియైన సౌకర్యాలు లేక విద్యార్థులు క్రమక్రమేనా తగ్గుతూ వస్తున్నారు. ఇదే తరుణంలో విద్యార్థులకు రోజు మెనూ ప్రకారం భోజనాన్ని పెట్టించే బాధ్యత హాస్టల్ వార్డెన్ ది ఉండగా ఆదివారం రోజున విద్యార్థులకు నాన్ వెజ్ ఆహారంగా పెట్టాల్సి ఉండగా కూరగాయల భోజనం పెట్టడంతో విద్యార్థులు వంట చేసే కుక్ ని ఈరోజు నాన్ వెజ్ కదా అంకుల్ అంటూ అడుగగా.. ఏమైనా ఉంటే వార్డెన్ ను అడగమని సూచించారు. దీంతో విద్యార్థులు హాస్టల్ వార్డెన్ ను మొబైల్ ఫోన్ ద్వారా సంప్రదించగా చికెన్ షాప్ కి వెళ్ళమని తెలిపారు. ఈ చికెన్ షాపుకు వెళ్లిన విద్యార్థులు రెండు కిలోల చికెన్ లో పావు కిలో లివర్లను కావాలని తీసుకున్నారు. విద్యార్థులకు ఇష్టమైన లివర్లను ఎక్కువగా తీసుకువచ్చి వంటలు చేసే కుక్ కి ఇచ్చారు. వంట తర్వాత ఒక్క విద్యార్థికి కూడా లివర్ రాకపోవడంతో ముకుమ్మడిగా మండల పార్థసారధికి ఫిర్యాదు చేశారు. తాము ఇష్టంగా తెచ్చుకున్న లివర్ల మాయంపై విచారణ జరపాలని కోరారు. చికెన్ కూరలో ఉండాల్సిన లివర్లు ఒక్కసారిగా మాయమయ్యాయని విద్యార్థులు ఆరోపించారు.

Advertisement

Also Read: Cyber Crime: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 1.07 కోట్ల మోసం.. ఢిల్లీకి చెందిన నిందితుడు అరెస్ట్

విద్యార్థులపై జలుం..

అదేవిధంగా తమకు మెనూ ప్రకారం ఏ ఒక్క రోజు కూడా వంటలు చేయడం లేదని విద్యార్థులకు ఇవ్వవలసిన దుప్పట్లను ఇవ్వకుండా ఉంచారని ఆరోపించారు. వంట చేసే కుక్ ప్రతిరోజు తాగి వచ్చి విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. హాస్టల్ ను విధులు నిర్వహిస్తూ సక్రమంగా విద్యార్థులకు ఆహారం, ఇతర వసతులను సమకూర్చాల్సిన వార్డెన్ సమయపాలన లోపంతో విధులు నిర్వహించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. లివర్ల మాయంపై ఎంపీడీవో కి విద్యార్థులు ఫిర్యాదు చేస్తే వంట చేసే వ్యక్తి వచ్చి విద్యార్థులను బెదిరిస్తుండడం గమనార్హం. వసతి గృహాల్లో నిత్యం నిఘ కొరవడడంతో కుక్ తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ విద్యార్థులపై జలుం ప్రదర్శిస్తున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సక్రమంగా తమకు ఆహారం అందించాలని, ఇతర వసతులపై కూడా అధికారులు దృష్టి సారించి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. సమయపాలన పాటించని వార్డెన్ తో సహా వంట మనిషిని కూడా సస్పెండ్ చేసి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పూర్తి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Also Read: Viral Video: మెట్రో స్టేషన్లలో అండర్‌వేర్ వెండింగ్ మెషిన్స్.. ఇదెప్పుడు నుంచి మామ?

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×