E-Paper
Advertisement

నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి!

నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి!
Advertisement

Nirmal: సెలవు రోజు కావడంతో ఆ చిన్నార్లు సరదాగా గడుపుదామనుకున్నారు. స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లడమే వారి కుటుంబాలకు ఆరని వేదన మిగిల్చింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

సరదాగా వెళ్లి.. ప్రమాదంలో చిక్కుకొని..

Advertisement

కుబీర్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు సెలవు దినం కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు సమీపంలోని డోడర్నా చెరువు వద్దకు వెళ్లారు. వీరిలో ఒక బాలుడు ఒడ్డునే ఉండిపోగా, గణేష్ (13), సోఫియాన్ (10) అనే ఇద్దరు బాలురు చెరువులోకి దిగారు. నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు.

చికిత్స పొందుతూ ఒకరు.. చెరువులోనే మరొకరు..

Advertisement

ఒడ్డున ఉన్న బాలుడి కేకలు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నీటిలో మునిగిన గణేశ్‌ను బయటకు తీసి, అత్యవసర చికిత్స కోసం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ గణేష్ తుదిశ్వాస విడిచాడు. మరోవైపు సోఫియాన్ చెరువులోనే ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: నా ప్రాణాలు కాపాడిన నాయకుడు ఇకలేరు..పెద్ది సంతాప సభలో హరీష్ రావు కన్నీళ్లు

Tags

Related News

ఆర్‌టీసీ గుర్తింపు ఎన్నికల వేల.. కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని!

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×