E-Paper
Advertisement

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్
Advertisement

Hyderabad: తెలంగాణాలో నకిలీ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అంశం ముదిరి పాకాన పడింది. ఈ అంశంపై బిగ్ టీవీలో కథనాలు జోరందు కోవడంతో ఆ శాఖ అధికారుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. సపోర్టు చేసిన అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలపై నిరుద్యోగ యువతీయువకులు మండి పడుతున్నారు. అధికారులపై వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ నకిలీ జూనియర్ లెక్చరర్ల బాగోతం

తెలంగాణలో మూడేళ్ల కిందట జరిగిన జూనియర్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ వ్యవహారం డొంక కదలింది. తొలుత వరంగల్‌లో వెలుగు చూసిన ఈ అంశం, ఆ తర్వాత మిగతా జిల్లాలకు క్రమంగా వ్యాపిస్తోంది. దీనిపై ‘బిగ్ టీవీ’లో వరుస కథనాలతో విద్యాశాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. నకిలీలపై చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు అధికారులతో ఆ శాఖ కమిషనర్ సమావేశమైనట్టు తెలుస్తోంది.

విద్యాశాఖ అధికారుల్లో ప్రకంపనలు, అర్ధరాత్రి వరకు భేటీ

Advertisement

అర్ధరాత్రి వరకు దీనిపై చర్చించినట్టు తెలుస్తోంది. ఏం చేస్తే నకిలీలు బయటకు వెళ్తారనే దానిపై చర్చ జరిగినట్టు సమాచారం. నకిలీ సర్టిఫికెట్లతో తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? రెగ్యులరైజ్ చేసినవారి జేఎల్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలా? ఆయా కాలేజీల నుంచి లెక్చరర్ల సరిఫికెట్లు విద్యాశాఖ కమిషన్ ఆఫీసుకు తీసుకొచ్చి వెరిఫికేషన్ చేయాలా? పోలీసు శాఖ నుంచి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే నకిలీలు బయటపడే అవకాశముందని అంటున్నారు.

నకిలీ జేఎల్ తొలగించాలని డిమాండ్ చేస్తున్న యువత

ఈ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ముందుకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఫేక్ సర్టిఫికెట్లు వ్యవహారం వెలుగులోకి రాగానే తెలంగాణ నిరుద్యోగులు, యువతీ-యువకులు రియాక్ట్ అవుతున్నారు. బిగ్ టీవీకి ఫోన్ చేసిన కొందరు నిరుద్యోగులు ఆనాడు జరిగిన వాస్తవాలను బయటపెడుతున్నారు. తాను వంద శాతం ప్రైవేటు ఉద్యోగం చేశానని, మాకంటే కొత్తవారికి ప్రభుత్వంలో అవకాశం రావడంతో అవన్నీ దొంగ సరిఫికెట్లు తెలుసని అంటున్నారు.

Advertisement

ALSO READ: ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

మళ్లీ 3000 మంది జేఎల్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో బిగ్ టీవీ చేసిన సాహసాన్ని మెచ్చు కుంటున్నారు. ఎలాంటి పరీక్షలు పెట్టకుండా ఎలా రిక్రూట్ చేశారని ప్రశ్నించినవాళ్లు లేకపోలేదు. ఆనాటి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అప్పటి పాలకులపై విరుచుకు పడుతున్నారు. జేఎల్ అంశంపై పోలీసులు రంగంలోకి దిగితే ఇంకెంత మంది వెలుగులోకి వస్తారో చూడాలి.

 

 

Related News

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

రైతులకు విద్యుత్ కష్టాలు రాకూడదు.. డీటీఆర్ వైఫల్యాలపై సీఎండీ కీలక ఆదేశాలు

సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.1.53 లక్షల లాభాల వాటా

అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

విద్యార్థులకు రేవంత్‌ సర్కార్ గుడ్‌న్యూస్‌.. రూ.204 కోట్లు విడుదల!

ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్.. విద్యుత్ శాఖకు భట్టి కీలక ఆదేశాలు

Big Stories

Advertisement
×