Sold Testicles For Car: కార్లంటే ఇష్టం ఉన్నవాళ్లు తమ వాహనాలను ప్రత్యేకంగా మోడిఫై చేయించుకోవాలనుకుంటారు. కొందరు కొత్త అల్లాయ్ వీల్స్ ఏర్పాటు చేసుకుంటే, మరికొందరు కారు ఎక్స్టీరియర్, ఇంటీరియర్ లో మార్పులు చేయిస్తుంటారు. అయితే, థాయిలాండ్ కు చెందిన ఓ కార్ లవర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన డ్రీమ్ కారును మోడిఫై చేయించుకోవడానికి అతను ఏకంగా తన శరీర భాగాలను అమ్మినట్లు వెల్లడించారు.
థాయిలాండ్కు చెందిన ఓ వ్యక్తికి కార్లంటే విపరీతమైన అభిమానం ఉందట. తనకు నచ్చిన కారును ప్రత్యేకంగా మార్చుకోవాలని, ఖరీదైన మోడిఫికేషన్లు చేయించుకోవాలని అతడు భావించాడు. ఈ క్రమంలో తన వృషణాలను విక్రయించి సుమారు రూ.22 కోట్లు సంపాదించాడు. ఆ మొత్తాన్ని తన డ్రీమ్ కారుకు అవసరమైన మార్పులు, ఖరీదైన విడిభాగాల కోసం ఖర్చు చేశాడు.
ప్రపంచ వ్యాప్తంగా కార్లను ఇష్టపడే చాలామంది తమ వాహనాలపై భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తుంటారు. కస్టమ్ బాడీ కిట్స్, స్పోర్టీ వీల్స్, పెర్ఫార్మెన్స్ అప్గ్రేడ్స్, ప్రీమియం ఆడియో సిస్టమ్స్, ప్రత్యేకమైన పెయింట్ వర్క్ లాంటి మార్పులతో కార్లను తమ అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన కార్ల మోడిఫికేషన్లకు లక్షల రూపాయల నుంచి అంతకంటే ఎక్కువ ఖర్చు కావచ్చు. అయితే, కారు కోసం శరీర భాగాలను విక్రయించాడనే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.
ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. కొంత మంది ఇదేం పోయేకాలం అని కామెంట్స్ పెడుతుంటే.. మరికొంత మంది తన కల కోసం ఎంతకైనా తెగిస్తారనే దానికి ఉదాహారణ అని మరికొందరు అంటున్నారు. విలాసాల కోసం జనాలు ఏం చేస్తున్నారో కనీసం అవగాహన లేకుండా ముందుకు వెళ్తున్నారని మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవు. థాయిలాండ్ వ్యక్తి నిజంగానే తన వృషణాలను రూ.22 కోట్లకు విక్రయించాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు నిజమా? కేవలం వైరల్ ప్రచారమా? అనేది తెలియాల్సి ఉంటుంది.
Read Also: చెట్టుకు సంకెళ్లు వేసి అరెస్ట్ చేశారు.. 128 ఏళ్లుగా విడుదల కాలేదు!