BigTV English
Advertisement

Indian Railway Station: ప్రయాణీకులకు అలర్ట్, ఇక నుంచి ఆ రైల్వే స్టేషన్ క్లోజ్!

Indian Railway Station: ప్రయాణీకులకు అలర్ట్, ఇక నుంచి ఆ రైల్వే స్టేషన్ క్లోజ్!

Bengaluru Railway Station: సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు ప్రయాణీకులు కీలకమైన అలర్ట్ జారీ చేశారు. మార్చి 5 నుంచి బెంగళూరులోని రైల్వే స్టేషన్ ను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రోజు వారీ ప్రయాణాలు చేసే ప్యాసింజర్లు ప్రత్యామ్నాయ బోర్డింగ్, డీబోర్డింగ్ పాయింట్లను చూసుకోవాలని సూచించారు.


మార్చి 5 నుంచి బెంగళూరు రైల్వే స్టేషన్ క్లోజ్

సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో ఆపరేషనల్ ఛేంజెస్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు తూర్పు రైల్వే స్టేషన్ లో పలు రైళ్లు ఆగవని తెలిపారు. రీసెంట్ గానే ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు కొద్ది రోజుల పాటు ఇతర మార్గాలను ఎంచుకోవాలన్నారు.


బెంగళూరు తూర్పు రైల్వే స్టేషన్ లో ఆగని రైళ్లు  

బెంగళూరు తూర్పు రైల్వే స్టేషన్ లో ఆగని రైళ్ల వివరాలను ఇప్పటికే సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఇంతకీ ఆ స్టేషన్ లో ఆగన రైళ్లే ఏవంటే..

⦿ రైలు నంబర్ 12614 – బెంగళూరు – చెన్నై ఎక్స్‌ ప్రెస్

⦿ రైలు నంబర్ 12607 – చెన్నై – బెంగళూరు లాల్‌ బాగ్ ఎక్స్‌ ప్రెస్

⦿ రైలు నంబర్ 16219/16220 – చామరాజనగర్ – తిరుపతి ఎక్స్‌ ప్రెస్

⦿ రైలు నంబర్ 16515/16516 – యశ్వంత్‌ పూర్- కార్వార్ ఎక్స్‌ ప్రెస్

⦿ రైలు నంబర్ 16585/16586 – యశ్వంత్‌ పూర్-మంగళూరు ఎక్స్‌ ప్రెస్

ఈ రైళ్లు మార్చి 5 నుంచి బెంగళూరు తూర్పు రైల్వే స్టేషన్ లో ఆగవని ఇండియన్ రైల్వే వెల్లడించింది.

బెంగళూరు తూర్పు స్టేషన్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారంటే?

బెంగళూరు తూర్పు స్టేషన్ దగ్గర ఆపరేషన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రద్దీని తగ్గించడం కోసం కొద్ది రోజుల పాటు క్లోజ్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్టేషన్‌ లో గత కొంత కాలంగా ఎక్కువ ట్రాఫిక్ కనిపిస్తుంది. అయితే, రైల్వే అధికారులు చేసే సర్దుబాట్ల కారణంగా ఈ ప్రాంతంలో రైలు కదలికను క్రమబద్ధీకరించడానికి సహాయపడనున్నాయి.

Read Also: నడి సంద్రంలో విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యాలా? ఈ షిప్పులో ‘అన్నీ’ చేసుకోవచ్చట!

బెంగళూరు ఈస్ట్ రైల్వే స్టేషన్ క్లోజ్.. ప్రయాణీకులు ఏం చేయాలంటే?

బెంగళూరు తూర్పు రైల్వే స్టేషన్ కొద్ది రోజుల పాటు క్లోజ్ కానున్న నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రయాణీకులకు కీలక విషయాలను వెల్లడించారు. ముందుగా ప్రయాణీకులు బోర్డింగ్ పాయింట్‌ ను తనిఖీ చేసుకోవాలి. నైరుతి రైల్వే వెబ్‌ సైట్ లేదంటే NTES యాప్‌ లో షెడ్యూల్‌ లను కన్ఫర్మ్ చేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ స్టేషన్ నుంచి ప్రయాణం చేసే ప్యాసింజర్లు కొత్త బోర్డింగ్, డీబోర్డింగ్ స్టేషన్లను సెలెక్ట్ చేసుకోవాలి. రైల్వే స్టేషన్ తిరిగి ఓపెన్ అయ్యే వరకు ఇదే పద్దతిని ఫాలో కావాలని అధికారులు సూచించారు.

Read Also:  అందుబాటులోకి వాటర్‌ మెట్రో.. మీరూ ఓసారి జర్నీ చేసేయండి!

Read Also:  భారత్ నుంచి ఆ అందాల లోకానికి కొత్త రైల్వేలైన్, ఎన్ని లాభాలో తెలుసా?

Related News

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

Big Stories

×