Hyderabad: సమాజంలో ప్రత్యేక వర్గాలైన ఖైదీలు-ట్రాన్స్ జెండర్లు ఉన్నత విద్యా పట్టాలను అందుకొని సరికొత్త రికార్డు సృష్టించారు. పట్టుదల ఉండేలాగానీ సాధించలేదని లేదని వారంతా నిరూపించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్-డిగ్రీ- పీజీ సర్టిఫికెట్లు అందుకున్నారు.
తెలిసి తెలియని వయస్సులో చిన్న చిన్న తప్పులు ద్వారా చాలామంది యువకులు జైలుకి వెళ్తున్నారు. వారిలో చదవాలన్న ఆకాంక్ష బలంగా ఉండడంతో అక్కడ చదువుతూ డిగ్రీ పట్టాలు అందుకుంటున్నారు. బుదవారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ కాన్వకేషన్‌కు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా. డిగ్రీ, పీజీ, డిప్లమా సర్టిఫికెట్లను యువతకు ప్రధానం చేశారు.
2025 -26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి 36 వేల మందికి డిగ్రీ, పీజీ, డిప్లమా సర్టిఫికెట్లను అందజేశారు. వారంతా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పట్టాలను అందుకున్నారు. పట్టాలు అందుకున్నవారిలో యూజీ, పీజీ డిగ్రీలు చేసినవారు 27 మంది ఖైదీలు ఉన్నారు. అందులో ఒకరికి గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ అందుకున్న రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీ సురేష్.
ఆయనతోపాటు చర్లపల్లి, రాజమండ్రి, కడప జైళ్ల నుంచి పలువురు ఖైదీలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా వివిధ రకాల కోర్సులు పూర్తి చేశారు. వారికి కూడా పట్టాలు అందజేశారు. 11 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ 38 మంది విద్యార్థులు అందుకున్నారు. ఈసారీ ఎక్కువగా 29 మహిళలు గోల్డ్ మెడల్స్ పొందినవారిలో ఉన్నారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ మాట్లాడారు.
ALSO READ: అధికారం పోయాక హీరోయిన్లను కూడా వదల్లేదు.. బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు బట్టబయలు: దయాకర్ గౌడ్
ప్రతిభ గల విద్యార్ధులకు అనేక అవకాశాలు ఉన్నాయని, చదువుతోపాటు ఇండస్ట్రీకి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. మొత్తం 36,145 మంది అభ్యర్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ప్రదానం చేసిన మొత్తం డిగ్రీల్లో 17,960 యూజీ డిగ్రీలు కాగా.. 18,185 పీజీ/డిప్లొమాలు/సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. గత నాలుగున్న దశాబ్దాలుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దాదాపు 6,27,175 డిగ్రీలను ప్రదానం చేసింది.