Big Stories

Rains: ఎక్కడెక్కడ ఎంత శాతం వర్షం కురిసిందంటే..?

Rain Details: అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పలు చోట్లా తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్లా భారీ వర్షాలు కురిశాయి. అయితే, కొన్నిచోట్లా ఈదురుగాలులతో కూడిన వర్షం, ఇంకొన్ని చోట్లా వడగండ్ల వర్షం కురిసింది. దీంతో రైతులు భారీగా పంట నష్టపోయారు. అదేవిధంగా వేర్వేరు ఘటనల్లో మొత్తం ఏడుగురు మృతిచెందినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

రాష్ట్రంలోనే అత్యధికంగా హైదరాబాద్ లోని మియాపూర్ లో వర్షపాతం నమోదైంది. 13.3 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఇటు కూకట్ పల్లిలో కూడా 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లిలో 10.7 శాతం, మేడ్చల్ జిల్లాలో 9.9 శాతం, సంగారెడ్డి లో 8.8 శాతం, నల్లగొండలో 6.7 శాతం, యాదాద్రి జిల్లాలో 6.5 శాతం, సిద్ధిపేట జిల్లా అక్కన్నపేటలో 6 శాతం, పెద్దపల్లిలో 5 శాతం, ములుగులోని ఏటూరునాగారంలో 4.4 శాతం వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది.

- Advertisement -

కాగా, రాష్ట్రంలో పలుచోట్లా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై కనిపించింది. కానీ, ఇంకొన్నిచోట్లా మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రాంతంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Also Read: నగర వాసులకు బీ అలర్ట్.. భారీ వర్షం.. నిలిచిన మెట్రో సేవలు

ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మంచిర్యాలతోపాటు పలు జిల్లాలో వడగండ్ల వర్షం కురిసినట్లు తెలుస్తోంది. భారీ వర్షం కురవడంతో ఆ జిల్లాల్లో కొంతవరకు భయానక పరిస్థితులు ఏర్పడినట్లయింది. రైతులు భారీగా పంట నష్టపోయారు. కొనగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిముద్దయ్యింది. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News