BigTV English

Salvo Industries: అక్కడినుంచే టెర్రిస్టులకు.. వెలుగులోకి సాల్వో అక్రమాలు

Salvo Industries: అక్కడినుంచే టెర్రిస్టులకు.. వెలుగులోకి సాల్వో అక్రమాలు

Salvo Industries: చేతి నిండా డబ్బులు..! పైగా రాజకీయ నేతల అండదండలు..! ఇంకేం ఆడిందే ఆట..! పాడిందే పాట..! ఇదీ కీసరలోని సాల్వో ఇండస్ట్రీస్‌ యజమాని బాగోతం. తనిఖీలు చేయాల్సిన అధికారులు పట్టించుకోరు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అటువైపు కన్నెత్తి చూడరు. దాంతో విచ్చలవిడిగా అక్రమంగా జిలిటెన్‌ స్టిక్స్‌ విక్రయిస్తున్నాడు జయరాంరెడ్డి. పేలుడు పదార్థాలను అక్రమంగా సప్లై చేస్తున్నా, కేసులు ఎన్ని ఉన్నా, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.


సాల్వో ఇండస్ట్రీస్‌ అక్రమాలపై బయటపడుతున్న సాక్ష్యాలు

నెల క్రితం బాపట్ల జిల్లా మార్టుర్‌లో 5 వేల కిలోల పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వలు బయటపడ్డాయి. సాల్వో పేరుతో ఉన్న జెలిటిన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, 180 బాక్సుల టండర్ బోల్ట్ జెలిటిన్ పదార్థాలను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఏ-6గా సాల్వో ఇండస్ట్రీస్‌ను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు, అక్కడితో వదిలేశారు. కనీసం ఇక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.


మావోయిస్టులకు సప్లై చేస్తున్న జిలిటెన్‌ స్టిక్స్‌

ఇటీవల జగిత్యాల జిల్లాలో మావోయిస్టులకు సప్లై చేస్తున్న జిలిటెన్‌ స్టిక్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను కూడా అరెస్ట్ చేశారు. అయితే, పేలుడు పదార్థాలపై ఐడియల్ పవర్ అని ఉందన్నట్లుగా జగిత్యాల పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆ కంపనీపై కేసులు పెట్టలేదు. సాల్వో జయరాం రెడ్డి బంధువులకే చెందిన 4 కంపెనీలు ఉమ్మడి నల్గోండ జిల్లాలో ఉన్నాయి. ఇతని కంపెనీ నుంచే కాకుండా వాళ్ల కంపెనీల నుంచి కూడా సప్లై చేయిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారీగా పట్టుబడ్డ పేలుడు పదార్థాలు

ఎక్స్‌ప్లోజివ్స్ దారి తప్పకుండా పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఎన్నో షరతులు పెట్టింది. బార్ కోడ్ సిస్టమ్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం రోజుకు ఎన్ని తయారు అవుతున్నాయనేది ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. చివరికి ఎవరికి చేరుతుందో కూడా నమోదు చేయాలి. కానీ, ఆ సిస్టమ్‌ను సాల్వో కంపెనీ ఫాలో కావడం లేదు. భూమి తన పేరు మీద లేకుండా సిస్టమ్‌ను మేనేజ్ చేసి, రెగ్యులరైజేషన్ కాకుండానే 200 ఎకరాల్లో అక్రమంగా జయరాం రెడ్డి కంపెనీని నడుపుతున్నాడు. అక్రమంగా వచ్చిన సొమ్ముతో రాజకీయ నాయకులకు, అధికారులను మ్యానేజ్ చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు స్థానికులు.

4,500 కిలోల థండర్‌బోల్డ్ జిలెటిన్‌తో పాటు..

కాగా సాల్వో ఇండస్ట్రీస్‌ అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసాంఘిక శక్తులకు సాల్వో కంపెనీ భారీగా పేలుడు పదార్థాలు అమ్ముతోంది. గత నెలలో ప్రకాశం జిల్లా మార్టూరులో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. 4 వేల 5 వందల కిలోల థండర్‌బోల్డ్ జిలెటిన్‌తో పాటు.. 5 వందల కిలోల సాల్వో సూపర్ E-90ని పోలీసులు సీజ్ చేశారు. వీటిని సాల్వో ఇండస్ట్రీస్.. ఎలాంటి ఇన్వాయిస్‌లు లేకుండా అమ్మేసింది. ఇన్వాయిస్ లేకుండా అంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను ఎందుకు అమ్మారు? అంటే.. ఆ కంపెనీ నోరు మెదపడం లేదు. దీంతో.. సాల్వోపై మార్టూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో సాల్వో ఇండస్ట్రీస్‌ను A6గా పేర్కొన్నారు.

500 కిలోల సాల్వో సూపర్ E-90ని సీజ్ చేసిన పోలీసులు

హైదరాబాద్ శివార్లలో సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్‌.. భారీగా పేలుడు పదార్థాలను తయారు చేస్తోంది. లైసెన్స్ ఉన్న వ్యాపారులకే పేలుడు పదార్థాలు అమ్మాలనే నిబంధనలు ఉన్నా.. వాటిని తుంగలో తొక్కి సాల్వో కంపెనీ వ్యాపారం చేస్తోంది. మార్టూరు కేసుతో సాల్వో బాగోతాలు మొత్తం బయటికొస్తున్నాయి. 5 వేల కిలోల పేలుడు పదార్థాలను, బిల్లులు లేకుండా ఒక్కరికే ఇచ్చేసింది. సాల్వో. బిల్లు లేకపోతే రికార్డుల్లోనూ వివరాలు నమోదు కావు. ఇలా అడ్డదారిలో ఎంత మందికి సాల్వో ఇండస్ట్రీస్ పేలుడు పదార్థాలు అమ్మిందో లెక్కలు తేలాల్సి ఉంది.

పేలుడు పదార్థాలు అమ్ముతూ కోట్లు దండుకుంటున్నారు

అనధికారికంగా భారీగా పేలుడు పదార్థాలు అమ్ముతూ సాల్వో యజమానులు కోట్లు దండుకుంటున్నారు. ఆ పేలుడు పదార్థాలు మావోయిస్టుల చేతుల్లో పడుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. పేలుడు పదార్థాలతో బాంబులు తయారు చేసి.. జనం మధ్య పేల్చితే పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. మరోవైపు.. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు సాల్వో అక్రమాలకు వంతపాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాల్వో ఇండస్ట్రీస్‌ ఇంత అడ్డగోలుగా పేలుడు పదార్థాలు అమ్ముతున్నా.. ఆ కంపెనీపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నదెవరనే చర్చ జరుగుతోంది.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×