E-Paper
Advertisement

స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ లేకపోతే సీజే.. రవాణా శాఖ సంచలన నిర్ణయం

స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ లేకపోతే సీజే.. రవాణా శాఖ సంచలన నిర్ణయం
Advertisement

School Bus Safety: జూన్ 15 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఈ విషయాన్ని రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ లోని రవాణాశాఖ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులను రవాణా చేసే అన్ని విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని తెలిపారు. ఫిట్‌నెస్ లేని వాహనాలు, అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించుకొని (ఓవర్ లోడ్) నడుపుతున్న వాహనాలు, భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

ప్రతి వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఉన్నాయా లేదా? అని ఈ తనిఖీల్లో చెక్ చేస్తున్నట్లు చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ , అనుభవం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా సౌకర్యాలు, టైర్లు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్న వాహనాలు లేదా ఓవర్‌లోడ్ చేస్తున్న వాహనాలను వెంటనే సీజ్ చేయడం చేస్తామన్నారు. సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు.

Advertisement

విద్యార్థులను రవాణా చేసే వాహనాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు , నిబంధనల పాటింపు వంటి పూర్తి బాధ్యత పాఠశాల, కళాశాల యాజమాన్యాలదేనని రవాణా శాఖ కమిషనర్ అన్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించుకునే వాహనాలలో తమ పిల్లలను తల్లిదండ్రులు పంపవద్దని సూచించారు. ఫిట్‌నెస్ లేని లేదా ఓవర్‌లోడ్ చేస్తున్న వాహనాలు తనిఖీలలో సీజ్ చేయబడిన పక్షంలో విద్యార్థులు మధ్యలో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Also Read: తెలంగాణలో పవన్ పోటీ చేయెుచ్చు.. ఎప్పుడైనా రావొచ్చు, వెళ్లొచ్చు.. సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయాణించే వాహనాల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలు, అనుమతులపై ముందుగానే నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు తమ వాహనాలను క్రమం తప్పకుండా ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరు పరిచి, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి విద్యార్థులను పాఠశాలలకు చేరవేసే ప్రతి వాహనం ఫిట్ నెస్ కలిగి ఉండడం తో పాటు పరిమితి కి మించి వాహనాల్లో తీసుకొని వెళ్లొద్దని హెచ్చరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తం గా 25,987 విద్యా సంస్థల బస్సులు ఉండగా 22,158 బస్సులు ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాయని మిగిలిన 3829 బస్సులు సైతం ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు.

Also Read: క‌మిష‌న‌ర్‌కు ప్రియాంక ఖ‌త‌ర్నాక్ వార్నింగ్‌! కుక్క కాటుకు చెప్పు దెబ్బే స‌రైన ట్రీట్‌మెంట్‌!

Related News

చంచల్ గూడ జైలుకు ట్రెయిని ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి!

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

ఓటరు సవరణ చేస్తే పథకాలు కట్ అవుతాయా? క్లారిటీ ఇచ్చేసిన ఎన్నికల కమిషన్!

ఇసుక నేలపై కాళేశ్వరం పునాది.. కట్టిన వారానికే లీకేజీ.. మంత్రి ఉత్తమ్ ఫైర్

తెలంగాణలో భారీ వర్షాలు.. బొగత జలపాతం ఉగ్రరూపం, సందర్శన నిలిపివేత

స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ హైలెవల్ మీటింగ్!

కాళేశ్వరం కట్టింది వాళ్లే.. కూల్చింది వాళ్లే.. కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫైర్!

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ప్రశాంత్ రెడ్డి ఫైర్.. ‘రెండున్నరేళ్లయినా పంపిణీ చేయరా?’

Big Stories

Advertisement
×