E-Paper
Advertisement

మాదాపూర్‌లో ఘోరం.. కుప్పకూలిన ఏడంతస్తుల భవనం, ఇద్దరు మృతి, ఎలా జరిగింది?

మాదాపూర్‌లో ఘోరం..  కుప్పకూలిన ఏడంతస్తుల భవనం, ఇద్దరు మృతి, ఎలా జరిగింది?
Advertisement

Madhapur: హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతంలో ఘోరం జరిగింది. ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన గురించి తెలియగానే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని శిధిలాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?

 

మాదాపూర్‌లో ఘోరం.. అంజయ్యనగర్‌లో కూలిన ఏడు అంతస్తుల భవనం

Advertisement

శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ సిటీలో గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో ఏడు అంతస్తుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీని ఆ భవనం శిధిలాలు పక్కనే ఉన్న అపార్ట్ మెంటుపై పడ్డాయి. నిర్మాణ పూర్తయి అద్దెకు ఇచ్చేందుకు రెడీగా ఉంది కొత్త భవనం. ఇంతలోనే ఒక్కసారిగా కూలిపోయింది. భవన శిధిలాలు తగిలి ఇద్దరు గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు.

 

ఇద్దరు కార్మికులు మృతి, పలువురికి గాయాలు

Advertisement

వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కూలిన భవనం పక్కనేవున్న హాస్టల్ నుంచి పలువురు వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. నాలాను ఆనుకున్న 50 గజాల స్థలంలో ఇటీవలే ఏడు అంతస్తుల భవన నిర్మాణం పూర్తయ్యింది. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉండొచ్చనే అనుమానంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ భవనం యజమాని ఎవరు అనేది ఇంకా గుర్తించాల్సివుంది.

భవనం కూలిన ప్రాంతం అంజయ్యనగర్ పరిధిలోకి వస్తుంది. గాయపడినవారిలో మాజీ ఆర్మీ అధికారి ఉన్నట్లు సమాచారం. ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందినవారి మృతదేహాలను వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోంది.  మృతిచెందినవారు మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు. ఉమేష్-(34),  మోపత్-(42) గుర్తించారు. టైల్స్ కార్మికులుగా పని చేస్తూ కొండాపూర్‌లో ఉంటున్నారు.

 

మృతులు మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికులు

ప్రమాదం జరిగిన భవనం బయట ఖాళీ స్థలం ఉంది. సాయంత్రం అయ్యేసరికి చిన్నారులు అక్కడే రకరకాల ఆటలు ఆడుతుంటారు. మధ్యాహ్నం సమయంలో ప్రాణ నష్టం తగ్గిందని, అదే సాయంత్రం వేళ జరిగితే ఎక్కువగా ఉండేదని అపార్టుమెంటు వాసులు చెబుతున్నారు. భవనం శిథిలాల పనులను పోలీసులు, జీహెచ్ఎంసీ, ఫైర్ సేఫ్టీ, దగ్గరుండి చేయిస్తున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల అపార్ట్‌మెంట్ వాసులు బెంబేలెత్తుతున్నారు.

ALSO READ: బీసీ రిజర్వేషన్లపై మోదీ-అమిత్ షా కుట్ర-వీహెచ్

ఇదే అంజయ్యనగర్‌లోని గతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిన విషయం తెల్సిందే. అనుమతి లేకుండా నిర్మించిన భవనాల వల్ల తరచు కూలిన ఘటనలు జరగడంపై ఆందోళన చెందుతున్నారు. భవన నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని ఇరుగుపొరుగు వాసుల ఆరోపణ. పక్కనున్న అపార్ట్‌మెంటు గోడలు, ఫ్లాట్లలో సామాగ్రి ధ్వంసమైంది.

Related News

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు.. క్రమశిక్షణా కమిటీ ముమ్మర చర్చ!

మానవ జోక్యం లేకుండా కచ్చితమైన బిల్లులు.. టీజీఎస్పీడీసీఎల్ సరికొత్త నిర్ణయం!

జీహెచ్‌ఎంసీ నాలాల పూడికతీతలో రూ. 20 కోట్ల అక్రమాలు.. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్!

ధర్మసంకటంలో పడ్డ కాంగ్రెస్ సీనియర్ మంత్రులు.. ఇంకెన్నాళ్లీ మౌన రథం

బీసీ రిజర్వేషన్లపై మోదీ, అమిత్ షా కుట్ర? వి. హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు!

ఇందిరమ్మ హోమ్స్ టవర్స్ లాటరీ ఆగష్టు 27 నుంచి.. జాబితాలో పేరు ఇలా చెక్ చేసుకోవచ్చు

సున్నం చెరువు గ్రేట్ మేకోవర్.. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం!

Big Stories

Advertisement
×