E-Paper
Advertisement

Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కిడ్నాప్.. రూ.50లక్షలు డిమాండ్‌ .. చివరికి ఏమైందంటే?

Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కిడ్నాప్.. రూ.50లక్షలు డిమాండ్‌ .. చివరికి ఏమైందంటే?
Advertisement

Hyderabad: రాయదుర్గం పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలో కూకట్‌పల్లికి చెందిన సురేందర్ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కిడ్నాప్‌కి గురి అయ్యాడు. కిడ్నాపర్లు ఈ విషయాన్ని బాధితుడి భార్యకు ఇంటర్నెట్‌ ద్వారా కాల్స్‌ చేసి తెలిపారు. సురేందర్‌ని విడుదల చేయాలంటే రూ.50 లక్షలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడి భార్య పోలీసు‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం సాయంత్రం కారులో వచ్చిన దుండగులు రాయదుర్గం కమిషనరేట్‌ కార్యాలయం పక్కనే ఉన్న కేర్‌ ఆసుపత్రి వద్ద సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఎత్తుకెళ్లారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలోనే కిడ్నాప్‌కి గురి అయ్యాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Advertisement

కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో పోలీసులను చూసి కిడ్నాపర్లు పారిపోయారు. సురేందర్‌ని కిడ్నాపర్లు చెర నుంచి కాపాడారు. కిడ్నాప్ గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×