Fever Surge: రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని తలపించే వాతావరణం కనిపిస్తోంది. అడపా దడపా కురుస్తున్న వర్షాలు, మారుతున్న ఉష్ణోగ్రతలు, కలుషిత నీరు, దోమల వ్యాప్తితో ఊరు, వాడా జ్వరాల బారిన పడుతున్నాయి. పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇటీవల నిర్వహించిన ప్రాథమిక ఫీవర్ సర్వేలో అత్యంత ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో సుమారు ఏకంగా 20 లక్షల మందికి పైగా జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు వంటి సీజనల్ వ్యాధుల లక్షణాలతో బాధపడుతున్నట్లు ప్రాథమిక నివేదిక స్పష్టం చేస్తోంది.ప్రతి ఏటా వర్షకాలంలో మొదట దెబ్బతినే ఏజెన్సీ ప్రాంతాలు ఈసారి కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గిరిజన గ్రామాలు, కొండకోనల్లో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు విపరీతంగా పెరిగిపోయాయి. సరైన రవాణా సౌకర్యాలు లేక, కలుషిత తాగునీటి వల్ల మారుమూల గ్రామాల్లో వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఏజెన్సీలో మొదలైన ఈ ‘సీజనల్ ఎఫెక్ట్’ ఇప్పుడు మైదాన ప్రాంతాలు, పట్టణాలు, నగరాలకు సైతం వేగంగా విస్తరించింది.
ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఇంటా కనీసం ఒక్కరైనా జ్వరంతో పాటు సీ జనల్ లక్షణాలతో బాధపడుతున్నారు. చాలా కుటుంబాల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించి ఇల్లంతా బాధితులతో నిండిపోతోంది. తీవ్రమైన జ్వరం, తగ్గని పొడి దగ్గు, ముక్కు కారడం,జలుబు, తీవ్రమైన కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు తీవ్ర నీరసం వంటి లక్షణాలువేధిస్తున్నాయి.ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్ధులు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ల బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , ప్రాంతీయ ఆసుపత్రుల నుంచి నగరాల్లోని బోధనాసుపత్రుల వరకు ఓపి క్యూలైన్లు మైళ్ళ కొద్దీ కనిపిస్తున్నాయి.రోజువారీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న బాధితుల సంఖ్య మూడింతలు పెరిగింది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ హాస్పిటల్ తో పాటు జిల్లాల్లోనే దవాఖానలు కూడా పేషెంట్ల లోడ్ పుల్ ఉన్నది.ప్రైవేటు క్లినిక్‌లు, కార్పొరేట్ ఆసుపత్రులు జ్వరం బాధితులతో నిండిపోయాయి.రక్త పరీక్షల కోసం డయాగ్నోస్టిక్ సెంటర్ల ముందు ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.దీన్ని ఆసరా చేసుకుని కొన్ని ప్రైవేట్ దవాఖానాలు దోపిడీ కి తెరలేపాయి.
Also Read: తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు..ఇంత కంటే బెస్ట్ మోడల్ ఉండదు తెలుసా ?
ఏజెన్సీ ప్రాంతాలు, సీజనల్ వ్యాధుల సమయం లో మురికివాడల్లో తక్షణమే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయాల్సి ఉంటుంది.స్థానిక సంస్థల ద్వారా ఫాగింగ్, నిలిచిన నీటిలో అంటీ-లార్వా పిచికారీ ముమ్మరం చేయాలి.తాగునీటి భావులు, ట్యాంకుల్లో క్లోరినేషన్ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారాసిటమాల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచాలి. ఎప్పటి కప్పుడు స్టేట్ నుంచి జిల్లా స్థాయి అధికారులకు రివ్యూ లు పెడుతూ అప్రమత్త o చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ పబ్లిక్ హెల్త్ డిపార్మెంట్ నుంచి ఇలాంటి యాక్షన్ ప్లాన్ ఏమి జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి.
“కాచి చల్లార్చిన నీటినే తాగాలి. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకుని, దోమ తెరలు వాడాలి.వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి, వేడి పదార్థాలనే ఆహారంగా తీసుకోవాలి. జ్వరం వచ్చిన వెంటనే స్థానిక ఆర్‌ఎంపీ లేదా మెడికల్ షాపుల్లో ఇష్టమొచ్చిన యాంటీబయోటిక్స్ వాడకుండా, వెంటనే అర్హులైన వైద్యుడిని సంప్రదించాలని డాక్టర్ రాజీవ్ తెలిపారు.
Also Read: క్యాన్సర్ నివారణకు క్యాప్సికమ్.. ఎరుపు, పసుపు లేదా గ్రీన్ ఏ కలర్ తింటే మంచిది?