Upcoming Hybrid SUVs: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో కారు కొనుగోలుదారులు మైలేజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో SUVలపై ఆసక్తి కూడా తగ్గడం లేదు. ఈ రెండు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆటోమొబైల్ కంపెనీలు హైబ్రిడ్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న SUVలు, కాంపాక్ట్ క్రాస్ ఓవర్లలో స్ట్రాంగ్ హైబ్రిడ్, సిరీస్ హైబ్రిడ్ టెక్నాలజీని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీతో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ పని చేస్తుంది. ఫలితంగా తక్కువ ఫ్యూయెల్ తో మంచి మైలేజీ ఇవ్వనున్నాయి. ఇంతకీ అవేంటంటే..
మారుతి సుజుకి చిన్న కార్ల కోసం సిరీస్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ నేరుగా చక్రాలను నడపడం కంటే బ్యాటరీకి విద్యుత్ అందించే జనరేటర్‌గా పనిచేసే అవకాశం ఉంది. ముందు చక్రాలను ఎలక్ట్రిక్ మోటార్ నడిపిస్తుంది. ఈ సెటప్ 1.2 లీటర్, మూడు సిలిండర్ల Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా ఉండనుంది. దీనికి చిన్న బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ యాడ్ అవుతాయి. దీని ద్వారా 35 కిమీ/లీ కంటే ఎక్కువ మైలేజీ రానుంది.
కియా నెక్ట్స్ జెనరేషన్ సోనెట్‌పై పని చేస్తోంది. ఇప్పటికే ఈ కొత్త మోడల్ భారత రోడ్లపై పరీక్షల్లో కనిపించింది. ఇదే టెక్నాలజీని హ్యుందాయ్ వెన్యూలో కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో 1.2 లీటర్, నాలుగు సిలిండర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, చిన్న బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా బ్యాటరీకి కొంత విద్యుత్ తిరిగి అందుతుంది. ఈ హైబ్రిడ్ వ్యవస్థతో 30 కిమీ/లీ కంటే ఎక్కువ మైలేజీ రానుంది. భవిష్యత్తులో ఇదే టెక్నాలజీని ఇతర కాంపాక్ట్ హ్యుందాయ్ మోడళ్లలోనూ ఉపయోగించే అవకాశం ఉంది.
రెనాల్ట్ బ్రిడ్జర్ కాన్సెప్ట్ ఆధారంగా సబ్ 4 మీటర్ SUVని 2027లో భారత మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. ఈ SUV డస్టర్‌కు కూడా ఆధారమైన RGMP ప్లాట్‌ఫామ్‌పై రూపొందనుంది. పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లతో పాటు హైబ్రిడ్ పవ ర్‌ట్రెయిన్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కు ఎలక్ట్రిక్ మోటార్, చిన్న బ్యాటరీ ప్యాక్ జతయ్యే అవకాశం ఉంది. దీని మైలేజీ 30 కిమీ కంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా.
హోండా కూడా కాంపాక్ట్ SUV విభాగంలో హైబ్రిడ్ ఆప్షన్‌ను తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఈ కొత్త మోడల్ 2028లో వచ్చే అవకాశం ఉంది. దీని కోసం హార్స్ పవర్ ట్రెయిన్ నుంచి తీసుకున్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్, CNG వంటి ఇంధన ఎంపికలకు అనుకూలంగా ఉండేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా 30 కి.మీ కంటే ఎక్కువ మైలేజీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Read Also: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 11 క్రేజీ కార్లు ఇవే!