KCR Vs Ministers: తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందా? తన మాటలపై ఎలాంటివారిపై సెటైరికల్ కామెంట్స్ చేసే కేసీఆర్ మాటల్లో ఆ వేడి తగ్గిందా? ఆయన స్పీచ్ తెలంగాణ ప్రజలను ఆకట్టుకోలేకపోయిందా? ఎన్నికల మాదిరిగానే ఆయన ప్రసంగం సాగిందా? ఇకపై ఊరుకునేది లేదని ఎందుకన్నారు? నేతలు, కార్యకర్తలను కాపాడుకునేందుకు పెద్దాయన స్కెచ్ వేశారా? అవుననే అంటున్నారు రాజకీయ పార్టీలు.
కేసీఆర్ కూడా జగన్ దారిలో
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయలు విచిత్రంగా ఉన్నాయి. నేతలు, క్యాడర్‌ని కాపాడుకునేందుకు జగన్ దారిలో కేసీఆర్ వెళ్తున్నారా? జగన్ మాదిరిగా కేసీఆర్ కూడా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారా? పోలీసులు దొంగ వాగ్దానాలు చేశారని ఎందుకన్నారు? రాబోయే ముప్పును కేసీఆర్ పసిగట్టారా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.
వరంగల్ వేదికగా బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సభ జరిగింది. ఈ సభకు వచ్చిన ప్రజలను, కార్యకర్తలను ఉత్సాహపరిచేలా కేసీఆర్ ప్రసంగం సాగింది. టీఆర్ఎస్ నాయకులు రోజూ మీడియా ముందు చెప్పే మాటలను కేసీఆర్ చెప్పారని, అందులో కొత్తగా ఏమీ లేదని అంటున్నారు మంత్రులు. కెసిఆర్ వ్యాఖ్యల్లో మునుపటి మారిదిగా దమ్ము లేదంటున్నారు.
సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోవడం తప్పదన్నారు. వరంగల్ సభలో కేసీఆర్ ప్రసంగం పేలవంగా ఉందని అంటున్నారు. ఆ పార్టీకి తెలంగాణ ముఖచిత్రంలో వీఆర్ఎస్ తప్పదని మంత్రుల మాట. ఫామ్ హౌస్‌లో కేసీఆర్ ఎవరికి కలవకుండా ఒక్కడే ఉండడంతో బయట జరుగుతున్న విషయాల పట్ల ఆయనకు స్పష్టత కొరవడిందని అంటున్నారు.
ALSO READ: తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు.. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!
మంత్రులు ఏమన్నారు?
ఆరోగ్యశ్రీ స్కీమ్ ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి చెల్లిందన్నారు. ఈ విషయం కూడా కేసీఆర్‌కు తెలవకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీని ఓడించిన ప్రజలను ఆయన మర్చిపోలేకపోతున్నారని తమదైన శైలిలో మంత్రులు వ్యాఖ్యానించారు. ఇంకా ప్రజలదే తప్పని భావనలో కేసీఆర్ (kcr) ఉన్నారని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ ఓ నియంత అని, అధికారం పోయిందనే అక్కసును ఈ సభ ద్వారా వెళ్లగక్కారని అన్నారు మంత్రి సీతక్క. రజతోత్సవ సభ అంటే వాళ్ల విజయాలు, పోరాటాల గురించి చెప్పుకొచ్చారని అన్నారు. అధికారం పోయిన తర్వాత ఆయన కుటుంబంలో చీలికలు, తగాదాలు బజారు పడుతున్నాయనే బాధ తప్ప మరొకటి ఆయనకు లేదన్నారు.
మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు మీరు డేట్ ఫిక్స్ చేయండి, అప్పుడు నిర్వహించుకుందామని అన్నారు. వ్యవస్థలను ఇష్టానుసారంగా వినియోగించుకుని చివరకు జడ్జీల ఫోన్‌లను ట్యాప్ చేసినవారిని విదేశాల్లో ఉంచి డ్రామాలు ఆడి, చివరకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా అవహేళన ఉంటుందా? అని ప్రశ్నించారు.
సోనియా మినహా తెలంగాణను ఎవరు ఇవ్వలేరన్న విషయం కేసీఆర్‌కు తెలుసన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ సభకు జనం రాకపోతే పోలీసుల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెపం నెట్టడం సరైనది కాదన్నారు. అగ్గిపెట్ట రాజకీయానికి బలైపోయిన ఉద్యమకారులకు కనీసం నివాళి అయినా అర్పించారా? అంటూ సూటిగా ప్రశ్నించారు మంత్రి పొన్నం.
పదేళ్లు గొప్పగా పాలించామని గొప్పగా చెబుతున్న కేసీఆర్, ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందెవరని ప్రశ్నించారు. 21 మంది ముఖ్యమంత్రుల పరిపాలనలో చేసిన అప్పు కేవలం రూ.64 వేల కోట్లేనని, బీఆర్ఎస్ హయాంలో 8 లక్షల కోట్లకు ఎలా చేరింది? ఇది నిజమా? అబద్దమా? విమర్శలు ఎక్కుపెట్టారు మంత్రి జూపల్లి.
పోలీసులకు కేసీఆర్ వార్నింగ్
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
ఇది ఆపడం ఎవరితరం కాదు
పోలీసులకు రాజకీయాలు ఎందుకు..?
డైరీలో రాసుకోండి ఎవరి లెక్కలు ఏంటో తీద్దాం
– కేసీఆర్ pic.twitter.com/CrvgL65CDu
— BIG TV Breaking News (@bigtvtelugu) April 27, 2025
కాంగ్రెస్ ను విలన్ అని చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఉపసంహరించుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
సోనియా గాంధీ మినహా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇవ్వలేరన్న విషయం కేసీఆర్ కు తెలుసు
కేసీఆర్ సభకు జనం రాకపోతే పోలీసుల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెపం నెట్టడం సరైనది కాదు
అగ్గిపెట్ట… pic.twitter.com/WYLWeQHQRE
— BIG TV Breaking News (@bigtvtelugu) April 27, 2025