E-Paper
Advertisement

తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు మహర్దశ: ఏ జిల్లాకు ఎన్నెన్ని కోట్లు మంజూరయ్యాయంటే..?

తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు మహర్దశ: ఏ జిల్లాకు ఎన్నెన్ని కోట్లు మంజూరయ్యాయంటే..?
Advertisement

Telangana Public Schools: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు అధునాతన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులను మంజూరు చేసింది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన 20 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో ప్రీ-ప్రైమరీ (నర్సరీ/ఎల్కేజీ) నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు సమగ్ర విద్యా సౌకర్యాల అభివృద్ధి కోసం రూ. 205.95 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు అంతర్జాతీయ బ్యాంకుల భాగస్వామ్యాన్ని ఖరారు చేశారు. మొత్తం నిధులలో 30 శాతం అనగా రూ. 61.79 కోట్లను రాష్ట్ర బడ్జెట్ 2026-27 అంచనాల నుంచి విడుదల చేయడానికి అనుమతించారు. మిగిలిన 70 శాతం నిధులు అనగా రూ. 144.16 కోట్లను ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నుంచి అందే రుణం ద్వారా సమకూర్చుకుంటారు. ఈ మౌలిక వసతుల పనుల బాధ్యతను తెలంగాణ విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు అప్పగించారు. పూర్తి పారదర్శకతతో ఈ-ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ-టెండర్లను ఆహ్వానించి పనులను సకాలంలో పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.

ఏయే పాఠశాలలకు ఎంత కేటాయించారంటే?

Advertisement

ఈ నిధులతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎంపిక చేసిన 20 పాఠశాలలకు నిధులు కేటాయించారు. వీటిలో వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని జెడ్పీహెచ్ఎస్ హుస్నాబాద్‌కు అత్యధికంగా రూ.12 కోట్లు, తాండూరు(బషీరాబాద్) స్కూల్‌కు రూ. 11 కోట్లు, పరిగి స్కూల్‌కు రూ. 10 కోట్లు కేటాయించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల(నవాబ్‌పేట) స్కూల్‌కు రూ. 11.85 కోట్లు, దేవరకద్ర (కౌకుంట్ల) పాఠశాలకు రూ.11.92 కోట్లు, మహబూబ్‌నగర్ గర్ల్స్ హైస్కూల్‌కు రూ. 9.7 కోట్లు దక్కాయి. ఇకపోతే ఖమ్మం జిల్లా భద్రాచలం(చార్ల) స్కూల్‌కు రూ. 11.3 కోట్లు, మధిర (ముదిగొండ)కు రూ. 8.8 కోట్లు, సత్తుపల్లి స్కూల్‌కు రూ. 9.65 కోట్లు మంజూరయ్యాయి. నిర్మల్ జిల్లా(ఖానాపూర్ గర్ల్స్) స్కూల్‌కు రూ.11.9 కోట్లు, ఆదిలాబాద్ జిల్లా(సోనాల)కు రూ.11 కోట్లు, హన్మకొండ జిల్లా కాజీపేట బాయ్స్ స్కూల్‌కు రూ. 10 కోట్లు, కరీంనగర్ జిల్లా(హుజూరాబాద్) స్కూల్‌కు రూ. 9.97 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆధునిక పాఠశాలల ఏర్పాటు ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత విద్య అందుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Also Read: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ.5.17 కోట్లు స్వాహా

Tags

Related News

అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

విద్యార్థులకు రేవంత్‌ సర్కార్ గుడ్‌న్యూస్‌.. రూ.204 కోట్లు విడుదల!

ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్.. విద్యుత్ శాఖకు భట్టి కీలక ఆదేశాలు

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ.5.17 కోట్లు స్వాహా

పేద రైతు ప్రాణాలు బలిగొన్న భూ కబ్జా దందా.. హుజూరాబాద్‌లో సర్పంచ్ భర్త అరాచకాలు!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఎలా దోరికాడో తెలుసా..?

రిమ్స్ ప్రమాదంపై కేటీఆర్ ఫైర్.. ఆసుపత్రి ఘటన వెనుక ఉన్న నిజాలు ఇవే!

Big Stories

Advertisement
×