E-Paper
Advertisement

ICT Instructors: మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ..!

ICT Instructors: మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ..!
Advertisement

ICT Instructors: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేసేందుకు, కంప్యూటర్ ల్యాబ్‌ల వినియోగాన్ని పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,288 ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీస్ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 1,644 మంది ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు.

1,700 స్కూళ్ల కోసం..

మొత్తం ఇన్‌స్ట్రక్టర్లలో సమగ్ర శిక్ష పరిధిలో 1,700 స్కూళ్ల కోసం 850 మందిని, అలాగే పీఎం శ్రీ పరిధిలో 1588 పాఠశాలలకు 794 మందిని కేటాయించారు. అంటే ప్రతి రెండు స్కూళ్లకు ఒక ఇన్‌స్ట్రక్టర్ ను నియమించనున్నారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఎంపిక చేసిన మూడు ప్రైవేట్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఈ నియామకాలు జరగనున్నాయి. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లను విద్యార్థులు, ఉపాధ్యాయులు సమర్థవంతంగా వినియోగించుకునేలా ఈ ఇన్‌స్ట్రక్టర్లు విధులు నిర్వర్తిస్తారు.

Advertisement

Also read: Transfers: మున్సిపల్ శాఖలో బదిలీల బండారం బట్టబయలు.. సస్పెండ్ అయిన ఇంజనీర్‌కు పోస్టింగ్!

తక్కువ దూరంలో..

ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి తక్షణమే స్కూల్ మ్యాపింగ్ ప్రక్రియను ప్రారంభించాలని జిల్లా విద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మ్యాపింగ్ ప్రకారం ఒక్కో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్‌కు గరిష్టంగా రెండు పాఠశాలలను మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. ఇన్‌స్ట్రక్టర్లకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా, జత చేసే రెండు పాఠశాలలు వీలైనంత వరకు ఒకే మండల పరిధిలో, అత్యంత తక్కువ దూరంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏజెన్సీలు సమర్పించే మ్యాపింగ్ ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి, స్కూల్ పేరు, యూడైస్ కోడ్ తదితర వివరాలను క్షుణ్ణంగా వెరిఫై చేసిన తర్వాతే ధృవీకరించాలని డీఈవోలను ఆదేశించారు. నియామకాలు, అభ్యర్థుల శిక్షణ, విధుల్లో చేరే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని విద్యాశాఖ హెచ్చరించింది.

Advertisement

Also Read: బండి మ‌ళ్లీ పిక‌ప్ అందుకున్న‌ది! కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టేనా?

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×