ICC ODI Rankings: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ముగిసిన నేపథ్యంలో… తాజాగా వన్డే ఫార్మాట్ ర్యాంకింగ్స్ బయటకు వచ్చాయి. ఈ వన్డే ఫార్మాట్ ర్యాంకింగ్స్ లో … టీమిండియా ప్లేయర్లు మంచి ప్రదర్శన కనబరిచారు. బ్యాటింగ్ అలాగే బౌలింగ్…. జాబితాలో కూడా టీమిండియా ప్లేయర్లకు మంచి స్థానాలే దక్కాయి. ముఖ్యంగా వన్డే ర్యాంకింగ్స్ లో… టాప్ 3 లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా స్టార్ ఆటగాడు గిల్ మొదటి స్థానంలో ఉంటే… మూడో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈసారి మెరుగైన స్థానాన్ని వన్డే ఫార్మాట్లో సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ.
Also Read: Shane Bond: ఇలాగే ఆడితే… బుమ్రా కెరీర్ క్లోజ్.. డేంజర్ బెల్స్ పంపిన బాండ్!
ఈ తరుణంలోనే తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో… రోహిత్ శర్మ మూడవ స్థానాన్ని దక్కించుకున్నాడు. అటు విరాట్ కోహ్లీ ఐదో స్థానాన్ని సంపాదించుకోగా… శ్రేయస్ అయ్యర్ పదవ ర్యాంకులో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయినప్పటికీ అతనికి చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా వినియోగించుకొని… దుమ్ము లేపాడు. ఈ తరుణంలోనే… వన్డే ర్యాంకింగ్స్ లో పదవ స్థానాన్ని దక్కించుకున్నాడు శ్రేయస్ అయ్యర్.
ఇలా ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో.. టీమిండియా ప్లేయర్లు ఏకంగా నలుగురు స్థానాన్ని సంపాదించుకున్నారు. గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే శ్రేయస్ అయ్యర్ ఈ టాప్ 10 లో ఉన్నారు. ఇక అటు బౌలింగ్ లో కూడా టీమిండియా ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనిపించారు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్… ఈసారి ప్రకటించిన ర్యాంకింగ్స్ లో మూడవ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 10వ స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. ఆల్ రౌండర్ జాబితాలో… పదో స్థానంలో నిలిచాడు రవీంద్ర జడేజా. ఇక వన్డే, టి20 లలో… ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టీమిండియా తొలి స్థానాన్ని దక్కించుకుంది.
Also Read: Hardik Pandya Instagram: కోహ్లీని దాటేసిన హార్దిక్ పాండ్య.. 6 నిమిషాల్లోనే!
ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ తర్వాత… టి20 లో టీం ఇండియాకు తిరుగులేకుండా పోయింది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో గెలుచుకున్న టీమిండియా… ఆ పరంపరను కొనసాగిస్తోంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ టీమిండియా కు మంచి విజయాలే దక్కుతున్నాయి. అలాగే గత ఏడాది కాలంగా వన్డే ఫార్మాట్లో కూడా టీమిండియా అద్భుతమైన విజయాలను అందుకుంటుంది. మొన్న చాంపియన్ సోప్ 2025 టోర్నమెంట్ కూడా గెలుచుకుంది టీమిండియా. అంతకుముందు స్వదేశంలో ఇంగ్లాండుతో జరిగిన వన్డేలో కూడా అద్భుతంగా విజయాన్ని. ఈ తరుణంలోనే… టి20 లు అలాగే వన్డేలలో… టీమిండియా అగ్రస్థానాన్ని సంపాదించుకుంది.