E-Paper
Advertisement

Free Feeder: బెంగళూరు ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..!

Free Feeder: బెంగళూరు ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..!
Advertisement

Free Feeder: స్వేచ్ఛ బ్యూరొో: హైదరాబాద్–బెంగుళూరు మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ (ఆర్‌జీఐఏ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) నుంచి హైదరాబాద్–బెంగుళూరు మధ్య నడిచే సూపర్ లగ్జరీ బస్సులకు అనుసంధానంగా ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి ప్రయాణికులను తరలించే ఫీడర్ బస్సు సేవలను ప్రారంభించింది. ఇకపై ఏసీ, ఏజే, ఏకే పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ ఏసీ సర్వీసుల్లో ప్రయాణించే వారికి ఈ ఫీడర్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి వెల్లడించారు.

ఈ ప్రాంతాల్లో నుండి..

హైదరాబాద్ నగరంలోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్), సికింద్రాబాద్, ప్రకాశ్‌నగర్, పర్యాటక భవన్, కేర్ హాస్పిటల్ (బంజారాహిల్స్), ఎన్ఎండీసీ, మెహిదీపట్నం, ఆరాంఘర్. మియాపూర్, నిజాంపేట్ ఎక్స్ రోడ్స్, జేఎన్‌టీయూ, మలేసియా టౌన్‌షిప్, శిల్పారామం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్, లింగంపల్లి, మదీనాగూడ, అల్ల్విన్ ఎక్స్ రోడ్స్, హఫీజ్‌పేట్, కొండాపూర్, కొత్తగూడ ఎక్స్ రోడ్స్, బొటానికల్ గార్డెన్ తదితర ప్రాంతాల నుంచి పుష్పక్ ఫీడర్ బస్సులు నడుస్తాయి.

Advertisement

Also read: Rythu Bharosa: 5 నుండి 6 ఎకరాలున్న రైతు ఖాతాల్లోకి.. రైతు భరోసా నిధులు విడుదల!

శంషాబాద్ వరకు..

హైదరాబాద్–బెంగుళూరు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు “శంషాబాద్ (ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీస్టేషన్ ఎదురుగా)” అనే బోర్డింగ్ పాయింట్‌ను ఎంపిక చేసుకోవాలి. అలా ఎంపిక చేసుకున్న వారికి ఏసీ, ఏజే, ఏకే పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ ఏసీ బస్సుల్లో శంషాబాద్ వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి హైదరాబాద్–బెంగుళూరు సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణం కొనసాగించవచ్చు.

ఆన్‌లైన్ బుకింగ్ యాప్..

Advertisement

శంషాబాద్ బోర్డింగ్ పాయింట్‌ను ఎంపిక చేసిన హైదరాబాద్–బెంగుళూరు టికెట్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఈ ఉచిత ఫీడర్ బస్సు సౌకర్యం వర్తిస్తుందని ఆర్టీసీ ప్రకటించింది. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి శంషాబాద్ బోర్డింగ్ పాయింట్‌కు ప్రయాణికులను చేర్చేందుకు ఫీడర్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ సౌకర్యానికి ప్రత్యేకంగా అదనపు చార్జీలు ఉండవు. ప్రయాణికులు టికెట్లను ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక ఆన్‌లైన్ బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.హైదరాబాద్–బెంగుళూరు మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడమే ఈ కొత్త ఏర్పాట్ల లక్ష్యమని ఎండీ నాగిరెడ్డి తెలిపారు.

Also read: ‘అరుంధతి పశుపతిలా కేసీఆర్‌ను బంధించారు’.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Related News

Solar Mandal: దేశానికే ఆదర్శంగా సీఎం రేవంత్ నియోజకవర్గం..!

రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ.. ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్!

సింగరేణి మనుగడకు కొత్త ప్లాన్.. రాబోయే 15 ఏళ్ల కోసం కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు!

రంకెలతో అంకెలు మారవు.. ఏ చర్చకైనా సిద్ధం.. హరీశ్ రావు సవాల్!

‘అరుంధతి పశుపతిలా కేసీఆర్‌ను బంధించారు’.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Farmhouse Rules: హైదరాబాద్ ఫార్మ్‌హౌస్ ఓనర్లకు కొత్త రూల్స్.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే ఫార్మ్‌హౌస్‌లు సీజ్!

Show Cause: కాంగ్రెస్‌లో ఫోన్ ఆడియో లీక్ కలకలం.. జిల్లా అధ్యక్షుడికే షాకిచ్చిన మాజీ సర్పంచ్!

Big Stories

Advertisement
×