BigTV English

Kavitha’s Default Bail hearing Adjourned: మరోసారి కవితకు షాక్.. ఈసారి ఏమయ్యిందంటే..?

Kavitha’s Default Bail hearing Adjourned: మరోసారి కవితకు షాక్.. ఈసారి ఏమయ్యిందంటే..?

MLC Kavitha’s Default Bail hearing Adjourned: ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి కూడా షాక్ తగిలినట్లయ్యింది. ఢిల్లీ మద్యం విధానం.. సీబీఐ కేసులో డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 5కు వాయిదా వేసింది. అయితే, విచారణలో భాగంగా కవితపై సీబీఐ వేసిన ఛార్జిషీట్ ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్నది. జులై 26న కవితను వర్చువల్ గా కోర్టులో హాజరుపర్చాలంటూ సీబీఐని ఆదేశించింది. అదేవిధంగా ఛార్జిషీట్ కాపీలను కూడా నిందితుల తరఫు లాయర్లకు ఇవ్వాలంటూ న్యాయస్థానం సూచించింది. కాగా, కవిత సహా మరో నలుగురి పాత్రపై జూన్ 7న సీబీఐ ఛార్జిషీట్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.


ఇదిలా ఉంటే.. సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కవిత కేసును వాదిస్తున్న న్యాయవాదులతో కేటీఆర్ సమావేశమైనట్లు తెలుస్తోంది. కవితకు బెయిల్ వచ్చే అంశంపై వారితో కేటీఆర్ చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు కేటీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read: స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై దుమారం.. ట్వీట్ ను సమర్థించుకున్న అధికారిణి


ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇతర రాష్ట్రాల్లో అనర్హత కోసం సుప్రీంకోర్టులో వాదించిన సీనియర్ న్యాయవాదులతో ఆయన భేటీ కానున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ విషయమై బీఆర్ఎస్ ప్రతినిధులు అసెంబ్లీ స్పీకర్ తోపాటు గవర్నర్ ను కూడా కలిశారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×