TSPSC Group 3: ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న గ్రూప్ -3 అభ్యర్థులకు శుభవార్త. టీజీపీఎస్సీ గ్రూప్-3 పోస్టుల భర్తీలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 18న నిర్వహించిన రాత పరీక్షలో సెలక్ట్ అయిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈ షెడ్యూల్ మేరకు ఎవరైనా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాకపోతే జులై 9న రిజర్వ్ డేగా నిర్ణయించారు. ఆ రోజు నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో జరగనుంది.
గతంలో గ్రూప్-3కి సంబంధించి 1,388 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. దానికి సంబంధించి రాత పరీక్ష సక్సెస్ చేసింది టీజీపీఎస్సీ. ఫలితాలను మార్చి 15న విడుదల చేసింది. తాజాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌తో పాటు అందుకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
ఆయా అభ్యర్థులు జూన్ 17 నుంచి జూలై 9 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని కమిషన్ సూచన చేసింది. ఇదిలాఉండగా తెలంగాణ గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా జూన్ 16న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనుంది. స్వయంగా ఈ విషయాన్ని టీజీపీఎస్సీ వెల్లడించింది.
ALSO READ: మాగంటిని చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన కేసీఆర్
రెండు విడతల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ముగియగా, వారి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. జూన్ 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని అభ్యర్థుల కోసం జూన్ 17న రిజర్వ్ డేగా పేర్కొన్నారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.