E-Paper
Advertisement

తుమ్మిడిహట్టిపై బిగ్ అప్‌డేట్.. సెప్టెంబర్ 1న ఢిల్లీలో సీడబ్ల్యూసీ కీలక భేటీ!

తుమ్మిడిహట్టిపై బిగ్ అప్‌డేట్.. సెప్టెంబర్ 1న ఢిల్లీలో సీడబ్ల్యూసీ కీలక భేటీ!
Advertisement

Tummidihatti Barrage: ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం చైర్మన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేసిన నిరంతర ప్రయత్నాల నేపథ్యంలోనే కేంద్ర జల సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి, రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించాలని కోరారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లగా, ప్రధానమంత్రి కార్యాలయం జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపించింది. అనంతరం ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్‌.పాటిల్‌కు సీఎం ప్రత్యేకంగా లేఖ రాసి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

Advertisement

మహారాష్ట్ర గతంలో అంగీకరించిన 148 మీటర్ల ఎత్తుకు బదులుగా 152 మీటర్ల ఎత్తు ఉండేలా అంగీకారం సాధించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోంది.148 మీటర్ల వద్ద అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని, భారీ పంపులు వినియోగిస్తే విద్యుత్‌ వ్యయం పెరుగుతుందని తెలంగాణ కేంద్రానికి వివరించింది. తక్కువ విద్యుత్‌ వ్యయంతో, దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టును నిర్మించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన వాదన.

Also Read: Vi రూ.2,249 vs BSNL రూ.2,799.. ఏడాదంతా పండగే.. కానీ రెండిట్లో ఏది బెస్ట్?

Advertisement

సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనాల ప్రకారం జలమట్టం పెంపుతో అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని కూడా ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. వెనుకబడిన, కరవు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించే ఈ కీలక ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం, మహారాష్ట్రతో వరుసగా సంప్రదింపులు కొనసాగిస్తోంది.

Also Read: ఓరి దేవుడా.. పదో అంతస్తు నుంచి దూకినా.. యువతికి ఏం కాలేదు!

Tags

Related News

రాఖీ పండుగ వేళ తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. ఇక మహిళలకు పండగే?

కేటీఆర్‌కు అరుదైన గౌరవం.. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్ ఎండిపోయిన చెరువులు.. చేపపిల్లల పథకం ఉన్నట్టా లేనట్టా..?

రాయదుర్గంలో ఐకానిక్ యూనిటీ మాల్‌.. రెండు వేల కోట్లతో ట్విన్ టవర్స్, ఎన్ని ప్రత్యేకలో తెలుసా?

ఆంధ్ర వ్యక్తులకు తెలంగాణ ఆలయ బోర్డులో చోటా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

గుట్టుచప్పుడు కాకుండా.. ఇంట్లోనే అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కలకలం

మీరాలం చెరువు పనులపై సీఎం రేవంత్ ఆకస్మిత తనిఖీలు, అధికారులు పరుగో పరుగు

Big Stories

Advertisement
×