E-Paper
Advertisement

అక్టోబర్‌ లో కొత్త స్కూటర్ల జాతర.. హోండా, యమహా నుంచి క్రేజీ మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

అక్టోబర్‌ లో కొత్త స్కూటర్ల జాతర.. హోండా, యమహా నుంచి క్రేజీ మోడల్స్ వచ్చేస్తున్నాయ్!
Advertisement

October 2026 Petrol Scooter Launches: ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. పెట్రోల్ స్కూటర్లకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని పలు కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 2026లో కొన్ని కొత్త స్కూటర్లు మార్కెట్లోకి రానుండగా, మరికొన్ని మోడళ్ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి. వీటిలో కమ్యూటర్ స్కూటర్లతో పాటు మ్యాక్సీ స్కూటర్లు కూడా ఉన్నాయి.

హోండా ADV 160

అక్టోబర్‌ లో అందరి దృష్టిని ఆకర్షించే మోడళ్లలో హోండా ADV 160 ఒకటి. ఈ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో పరిచయమైనప్పటికీ, డెలివరీలు అక్టోబర్ మధ్య నుంచి ప్రారంభం కానున్నాయి. 156.9cc ఇంజిన్‌ తో వచ్చే ఈ మోడల్ E85 ఫ్లెక్స్ ఫ్యూయల్‌ కు అనుగుణంగా రూపొందించినట్లు తెలుస్తోంది. రగ్గడ్ డిజైన్‌ తో పాటు TFT డిస్‌ ప్లే, హోండా రోడ్ సింక్ నావిగేషన్, ట్రాక్షన్ కంట్రోల్  లాంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.  దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.1.70 లక్షలుగా ఉండొచ్చని అంచనా.

యాక్టివా 7G

Advertisement

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటైన యాక్టివాకు నెక్ట్స్ జెనరేషన్ మోడల్‌గా యాక్టివా 7Gపై భారీ అంచనాలు ఉన్నాయి. పండుగ సీజన్‌ ను టార్గెట్ చేస్తూ అక్టోబర్‌లో ఈ స్కూటర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ కీ, మారిన డిజైన్, మెరుగైన ఇంధన సామర్థ్యం లాంటి మార్పులు ఇందులో ఉండొచ్చని సమాచారం. దీని ధర సుమారు రూ.80 వేల నుంచి రూ.90 వేల మధ్య ఉంటుందని తెలుస్తోంది.

హోండా PCX 160

హోండా PCX 160 కూడా అక్టోబర్‌లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న మరో ఆసక్తికరమైన మోడల్. అక్టోబర్ 22న విడుదల కావచ్చని తెలుస్తోంది. 156cc ఇంజిన్‌తో సుమారు 15.8 PS శక్తిని అందించే ఈ స్కూటర్, సాధారణ కమ్యూటర్ల కంటే ఎక్కువ పనితీరు కోరుకునే రైడర్లను టార్గెట్ చేసుకోనుంది.  ప్రీమియం డిజైన్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్, హైవే ప్రయాణాలకు అనుకూలమైన సెటప్ దీని ప్రత్యేకతలుగా నిలిచే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ.1.20 లక్షలు.

యమహా NMax 155

Advertisement

యమహా NMax 155పై కూడా భారత స్కూటర్ మార్కెట్లో ఆసక్తి నెలకొంది. అక్టోబర్ మొదటి వారం తర్వాత మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. 155cc లిక్విడ్ కూల్డ్ VVA ఇంజిన్‌తో వచ్చే NMax, అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే గుర్తింపు పొందిన మ్యాక్సీ స్కూటర్. భారత్ లో దీని ధర సుమారు రూ.1.50 లక్షలుగా ఉండవచ్చని అంచనా. రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్లను ఇష్టపడే వారికి అనుకూలంగా ఉంటుంది.

Vespa GTS 300

ఇక ప్రీమియం స్కూటర్ మార్కెట్లో Vespa GTS 300 ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. అక్టోబర్ 28న దీన్ని పరిమిత ప్రీమియం లాంచ్‌గా తీసుకురావచ్చనే అంచనాలు ఉన్నాయి. 278cc సింగిల్-సిలిండర్ ఇంజిన్, ఇటాలియన్ స్టైలింగ్, స్టీల్ మోనోకాక్ బాడీ వంటి అంశాలు దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్నాయి. దీని ధర రూ.4.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

Read Also: టీవీఎస్ To సుజుకి.. అక్టోబర్‌లో దుమ్మురేపే ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎంట్రీ!

Tags

Related News

టాటా To హ్యుందాయ్.. అక్టోబర్‌ లో విడుదలయ్యే సూపర్ మోడల్స్ ఇవే!

టీవీఎస్ To సుజుకి.. అక్టోబర్‌లో దుమ్మురేపే ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎంట్రీ!

259 కిమీ రేంజ్‌ తో నిస్సాన్ కొత్త EV.. చిన్న కారులో అదిరిపోయే ఫీచర్లు!

పల్సర్‌కు మళ్లీ పాత జోష్ వస్తుందా? కొత్త 125, 150తో బజాజ్ మాస్టర్ ప్లాన్!

కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ వచ్చేస్తోంది.. లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

టాటా To మహీంద్రా.. బ్లైండ్ స్పాట్ ఫీచర్ ఉన్న కార్ల లిస్ట్ ఇదే!

టాటా నంబర్ వన్.. మహీంద్రా నెక్స్ట్.. విన్‌ఫాస్ట్ స్పీడ్ చూస్తే షాక్!

Big Stories

Advertisement
×