Big Stories

kavitha : మునుగోడుపై కవిత మౌనరాగం?.. ఏంటి సంగతి?

kavitha : ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కూతురు. కేటీఆర్ సోదరి. నాన్న, అన్నలకు తగ్గట్టే బాగా మాటకారి. గళగళా మాట్లాడతారు. ఎలాంటి అంశంపైనైనా స్పందిస్తారు. బీజేపీ చేతిలో ఓడిపోయాననే కోపమో ఏమో.. ఆ పార్టీని విమర్శించడంలో ముందుంటారు. అలాంటి కవిత.. కీలక మునుగోడు ఎన్నికపై మౌనంగా ఉండటం చర్చనీయాంశమైంది. కేసీఆర్ తో సహా యావత్ గులాబీ దళం మునుగోడులో ప్రచారంతో ఊదరగొడితే.. కవిత మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు. మునుగోడులో కాలు మోపలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు? ఎందుకు? కవిత మౌనం వెనుక రీజన్ ఏంటి?

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం భయమే కవిత నోటికి తాళం పడటానికి కారణం అంటున్నారు. ఢిల్లీ మద్యం కాంట్రాక్టు అక్రమాల్లో కవిత ప్రమేయం ఉందంటూ కొంతకాలంగా కమలనాథులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. త్వరలోనే కవిత జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఇప్పటికే తెలంగాణలో సీబీఐ దాడులు చేసింది. ఒకరిని అరెస్టు కూడా చేసింది. ఆ కేసుపై ఇంకా దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో మునుగోడు ఉప ఎన్నిక రావడంతో టీఆర్ఎస్ శ్రేణులంతా అక్కడ వాలిపోయారు ఒక్క కవిత మినహా.

- Advertisement -

కవిత కనుక మునుగోడుకు వస్తే.. ఆమెపై ఢిల్లీ లిక్కర్ దందాపై మరింతగా కమలనాథులు రెచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ విషయం గ్రహించే కవిత ఏమాత్రం తొందరపడకుండా.. మునుగోడుకు వెళ్లకుండా.. వ్యూహాత్మక మౌనం వహించారని అంటున్నారు. కవితను మనుగోడుకు వెళ్లొద్దని స్వయంగా సీఎం కేసీఆరే ఆదేశించారని చెబుతున్నారు. కవిత వెళ్లితే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని.. అది బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుందని ఆమెను పార్టీనే పక్కన పెట్టేసిందని అంటున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఇప్పటి వరకూ పెద్దగా స్పందించని కవిత.. మునుగోడు ఎన్నిక ముగిసినందున ఇప్పుడైనా నోరు విప్పుతారా? బీజేపీ ఆరోపణలపై ఎదురుదాడి చేస్తారా? అనేది ఆసక్తికరం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News