BigTV English

YSRCP 3rd List: నేడు వైసీపీ మూడోలిస్ట్ విడుదలకు ఛాన్స్.. భారీగా మార్పులు ?

YSRCP 3rd List: నేడు వైసీపీ మూడోలిస్ట్ విడుదలకు ఛాన్స్.. భారీగా మార్పులు ?

YSRCP 3rd List: YCPలో నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల కలకలం కొనసాగుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల YCP సమన్వయకర్తల మూడో జాబితాను ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. అందులో 25 నుంచి 30 వరకు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిసింది. వాటిలో ప్రధానంగా లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయకర్తల పేర్లు ఎక్కువ ఉండే అవకాశం ఉందంటున్నారు.


వైసీపీలో అసంతృప్తుల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం కూడా సీఎం కార్యాలయానికి 11 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. సీఎంవో నుంచి కాల్‌ వెళ్లినా మల్లాది విష్ణు పట్టించుకోలేదు. అటు సీఎం ఆఫీస్‌కు వెళ్లినప్పటికీ జగన్‌ ను మాత్రం పార్ధసారథి కలవలేదని తెలుస్తోంది. బాలినేని రాక కోసం సీఎంవో వద్ద ఎదురు చూసి చూసి మార్కాపురం ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

పార్టీ సమన్వయకర్తలు మార్పుల ఆవశ్యకతపై పలువురు నేతలు.. అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. అర్ధరాత్రి మల్లాది విష్ణు అనుచరులు.. అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్‌ను అడ్డుకున్నారు. మరోవైపు సింగనమల ఎమ్మెల్యే భర్తకు కూడా సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఇక చివరి నిమిషాల్లో మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్‌ తో సమావేశమయ్యారు. నేడు మూడో లిస్ట్ విడుదల చేయనున్న నేపథ్యంలో.. మరికొంతమంది నేతల్లో గుబులు మొదలైంది. ఎవరికి టికెట్ ఉంటుందో.. ఎవరి సీటు చిరిగిపోతుందోనని వైసీపీ సిట్టింగులు ఆందోళన చెందుతున్నారు.


.

.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×