Coconut Prices: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది సీజన్ తో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. వగరు, తీపి కలబోతగా ఉండే కోకోనట్ వాటర్.. శరీరంలోని అన్ని సమస్యలను దూరం చేస్తాయి. ఇందులో సహజమైన ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు గుండె, మూత్రపిండాలు, డయాబెటిస్, చర్మ సౌందర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సాయపడుతాయి. ఇండియాలో సుమారు రూ. 50కి లభించే కొబ్బరి బోండాం. విదేశాల్లో చాలా ఎక్కువ ధర పలుకుతుంది. ముఖ్యంగా చైనా, అమెరికా, యూకే లాంటి దేశాల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, అక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండవు.
చైనాలో కొబ్బరి బోండాం ధర ఎంతంటే?
మన దగ్గర రూ. 50 పలికే కొబ్బరి బోండాం ధర చైనాలో 8 నుంచి 12 యువాన్లు పలుకుతుంది. భారత కరెన్సీలో ఈ ధర సుమారు రూ. 90 నుంచి 140 వరకు ఉంటుంది. ఈ ధర రోడ్డు పక్కన ఉండే బండ్ల మీద దొరికే వాటికి మాత్రమే. అదే స్టోర్లలో అయితే, 15 యువాన్ల వరకు ఉంటుంది. అంటే భారత కరెన్సీలో రూ. 170 ఉంటుంది. చైనాకు కొబ్బరి బోండాలు, కాయలు థాయ్ లాండ్, వియత్నాం నుంచి దిగుమతి అవుతాయి. రవాణా, దిగుమతి సుంకం కలిపి ధర ఎక్కువ అవుతుంది.
అమెరికాలో బోండాం ధర మరీ ఎక్కువ!
ఇక అమెరికాలో కొబ్బరి బోండాం ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో ఒక్కో బోండాం ధర 3 నుంచి 6 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో సుమారు రూ. 250 నుంచి రూ. 500 అవుతుంది. అమెరికాలో కోకోనడ్ స్ట్రీట్ వెండర్స్ ఎక్కువగా ఉండరు. అందుకే, బోండాం లగ్జరీ డ్రింక్ గా మారిపోయింది. అక్కడి ప్రజలు కోకోనట్ వాటర్ ను ఎంతో ఇష్టంగా తాగుతారు. ఆరోగ్యం మీద సృహ ఉండే చాలా మంది కొబ్బరి నీళ్లు తాగుతుంటారు.
Read Also: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
యూకేలో కొబ్బరి బోండాం కాస్ట్ ఎంత అంటే?
ఇక యూకేలో కొబ్బరి బోండాం ధర 2 పౌండ్లు. భారత కరెన్సీలో ఈ రేటు రూ. 210. భారత్ లో రోడ్ సైడ్ తాగి పడేసే బోండాంను అక్కడ ఓ స్పెషల్ ఐటెమ్ గా చూస్తారు. అక్కడ మనలా కాకుండా చక్కగా కట్ చేసి కొబ్బరితో సహా కవర్ లో ప్యాక్ చేసి ఇస్తారు. కోకోనట్ వాటర్ తాగడంతో పాటు చక్కగా కొబ్బరి తినేయొచ్చు. అందుకే, అక్కడ కాస్త రేటు ఎక్కువగా పలుకుతుంది. ఆరోగ్యం కోసం అక్కడి ప్రజలు అంత ఎక్కువ ఖర్చు చేసి కొబ్బరి బోండాం తాగుతుంటే, మనం మాత్రం కూల్ డ్రింక్స్ అంటూ ఎగబడుతున్నాం. ఇకపై మనం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొబ్బరి బోండాం తాగేద్దాం.
Read Also: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!