Air India Offers Flight Tickets: ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. జస్ట్ రూ. 599కే ప్రీమియం ఎకానమీ టికెట్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. విమాన ప్రయాణం చేయాలనే పేద ప్రజల కలను నెరవేర్చేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ టికెట్ పొందిన ప్రయాణీకులు దేశంలోని ఏ రూట్లలో ప్రయాణించే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 599కే ప్రీమియం ఎకానమీ టికెట్లు
ధనవంతులు నిత్యం విమాన ప్రయాణాలు చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ విమాన ప్రయాణాన్ని ఓ కలగా భావించే ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి కలను నెరవేర్చడం తమ బాధ్యత అంటోంది టాటా గ్రూప్ నకు చెందిన ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ. అందుకే తక్కువ ధరకు ప్రీమియం ఎకానమీ ఫ్లైట్ టికెట్లను విక్రయిస్తోంది. ఎయిర్ ఇండియా డొమెస్టిక్ విమానాల్లో ప్రీమియం ఎకానమీ టికెట్ ధరను కేవలం రూ. 599 నుంచి మొదలు పెట్టింది. ఇది సాధారణ ఎకానమీ ధరతో పోల్చితే చాలా తక్కువ కావడం విశేషం. ఈ ఆఫర్ రూట్, డిమాండ్ ను బట్టి మారుతుంది. అంతేకాదు, ఇండియాలో ప్రీమియం ఎకానమీ అందించే ఏకైక ఎయిర్ లైన్ ఎయిర్ ఇండియా. రూ. 599 ఆఫర్ ను ఉపయోగించి టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణీకులు ఎయిర్ ఇండియాకు చెందిన 39 డొమెస్టిక్ రూట్లలో ఏదైనా ఒక మార్గంలో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది.
వారానికి 50 వేలకు పైగా సీట్లు
మధ్య తరగతి ప్రజలు విమానాయం చేయాలనేలా నిర్ణయం తీసుకోవడంతో పాటు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసింది. వారానికి 50 వేల సీట్లను డిస్కౌంట్ ధరలో అందించాలని నిర్ణయించింది. తాజాగా ఎయిర్ ఇండియా ప్రీమియం ఎకానమీ సీట్లను 30% పెంచింది. ఈ నేపథ్యంలో డిస్కౌంట్ ధరల్లో ప్రీమియం ఎకానమీ సీట్ల సంఖ్య వారానికి 65 వేలకు పెరిగింది. వీటిలో 34 వేల సీట్లను మెట్రో నగరాల మధ్య అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది.
Read Also: ప్లాట్‌ఫాంపై నిద్ర.. బట్టల షాప్‌లో పని.. చివరికి నిలోఫర్ కేఫ్‌కు యజమాని!
ఏ రూట్లలో ప్రయాణించే అవకాశం ఉందంటే?
ఎయిర్ ఇండియా తీసుకొచ్చిన రూ. 599 ఆఫర్ లో టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణీకులు దేశంలోని పలు కీలక నగరాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ మేరకు రూట్ల వివరాలను విమానయాన సంస్థ ప్రకటించింది. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్, ముంబై-బెంగళూరు, ముంబై-హైదరాబాద్ రూట్లలో ఆఫర్ టికెట్ తో ప్రీమియం ఎకానమీ క్లాస్ లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ప్రీమియం ఎకానమీ కస్టమర్లకు అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ఫ్రీగా సీట్లు సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. చెక్ ఇన్, బోర్డింగ్, లగేజీకి ప్రయారిటీ కూడా ఉంటుందని ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్ ను ఉపయోగించుకునేందు ప్రయాణీకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఆఫర్ పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: గర్భిణీలకు ఏడో నెలలోనే ఎందుకు సీమంతం చేస్తారంటే.. ఇదీ అసలు విషయం!