E-Paper
Advertisement

విశాఖ – భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. రూట్లు, ఛార్జీలు, టైమింగ్స్ పూర్తి వివరాలు!

విశాఖ – భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. రూట్లు, ఛార్జీలు, టైమింగ్స్ పూర్తి వివరాలు!
Advertisement

Aero Express: విశాఖపట్నం నుంచి నిర్మిస్తున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ తీపి కబురు అందించింది. ప్రయాణాన్ని మరింత వేగవంతం, సౌకర్యవంతం చేసేందుకు ఏరో ఎక్స్‌ప్రెస్ పేరిట ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరం నలుమూలల నుంచి రెండు ప్రధాన మార్గాల్లో ASR-1, ASR-2 బస్సులను నడపాలని నిర్ణయించారు.

బస్సు సర్వీసుల రూట్లు, సమయాలు

Advertisement

ఈ ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రతిరోజూ ఉదయం 4:30 గంటల నుంచే రాత్రి 10:30 గంటల వరకు నిరంతరం రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా టైమ్‌టేబుల్‌ను సిద్ధం చేశారు. ASR-1 రూట్ గాజువాక నుంచి బయలుదేరి NAD, గురుద్వార్, జూ పార్క్, మారికవలస, ఆనందపురం, తగరపువలస, ఎయిర్‌పోర్ట్ జంక్షన్ మీదుగా భోగాపురం చేరుకుంటుంది. ఇక నగరంలోని మరికొన్ని ప్రధాన ప్రాంతాలను కవర్ చేస్తూ నడిచే ASR-2 రూట్ గాజువాక నుంచి ప్రారంభమై సింధియా, వైజాగ్ రైల్వే స్టేషన్, కాంప్లెక్స్ బస్ స్టేషన్, సిరిపురం, ఇస్కాన్ టెంపుల్, ఐటీ హిల్స్, మారికవలస, ఆనందపురం, తగరపువలస, ఎయిర్‌పోర్ట్ జంక్షన్ మీదుగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది.

చార్జీల వివరాలు..

Advertisement

ప్రయాణికులు ఎక్కే ప్రాంతాన్ని బట్టి చార్జీలను చాలా స్పష్టంగా ఖరారు చేశారు. ASR-1 మార్గంలో.. పాత గాజువాక నుంచి రూ. 400, NAD నుంచి రూ. 350, గురుద్వార్ నుంచి రూ. 300, జూ పార్క్ నుంచి రూ. 250, మారికవలస నుంచి రూ. 200, ఆనందపురం నుంచి రూ. 150, తగరపువలస నుంచి రూ. 100, ఎయిర్‌పోర్ట్ జంక్షన్ నుంచి రూ. 50 గా నిర్ణయించారు.

ASR-2 మార్గంలో.. పాత గాజువాక, సింధియా , కంచరపాలెం ప్రాంతాల నుంచి ప్రయాణించే వారికి రూ. 400 చార్జీ ఉంటుంది. అలాగే సిరిపురం నుంచి రూ. 350, ఇస్కాన్ టెంపుల్ నుంచి రూ. 300, ఐటీ హిల్స్ నుంచి రూ. 250, మారికవలస నుంచి రూ. 200, ఆనందపురం నుంచి రూ. 150, తగరపువలస నుంచి రూ. 100, చివరిగా ఎయిర్‌పోర్ట్ జంక్షన్ నుంచి రూ. 50 గా చార్జీలు అమల్లో ఉంటాయి.

ఈ కొత్త ఏరో ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే విమాన ప్రయాణికులకు ప్రైవేట్ టాక్సీల బాదుడు నుంచి ఉపశమనం లభించడమే కాకుండా, సురక్షితమైన, సమయపాలన కలిగిన రవాణా సదుపాయం సొంతమవుతుంది.

Also Read: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం.. ల్యాండ్‌ అయిన తొలి విమానం!

Tags

Related News

రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

రైల్వే ట్రాక్‌ లపై డ్రోన్లతో నిఘా.. ప్రయాణాలకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు!

వెయిటింగ్ లిస్ట్ ఉన్నా టెన్షన్ వద్దు.. చార్ట్ తర్వాత కూడా రైలు టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు!

పగిలిన అద్దాలు.. కంపుకొట్టే టాయిలెట్లు.. బాబోయ్.. ఇది వందేభారత్ రైలా?

Big Stories

Advertisement
×