BigTV English

Indian Railways: బాబోయ్.. దేశంలో రోజూ ఇన్ని రైళ్లు నడుస్తాయా? అస్సలు ఊహించి ఉండరు!

Indian Railways: బాబోయ్.. దేశంలో రోజూ ఇన్ని రైళ్లు నడుస్తాయా? అస్సలు ఊహించి ఉండరు!

తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణాలు చేయాలనుకునే వారిలో చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే, భారతీయ రైల్వే నెట్ వర్క్ ఎంత విశాలమైనదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేశంలో ఎన్ని రైళ్లు ఉన్నాయి? రోజూ ఎంత మంది ప్రయాణిస్తారు? అనే విషయాలు తెలుసా? తెలియకపోతే.. ఈ స్టోరీ చదవాల్సిందే!


దేశంలో మొత్తం ఎన్ని రైళ్లు ఉన్నాయంటే?

దేశంలో తొలి రైలు ఏప్రిల్ 16, 1853న బోరీ బందర్ (ముంబై) నుండి థానే వరకు 14 కోచ్‌ లో మొదటి రైలును నడిపించింది. ప్రస్తుతం ఇండియన్ రైల్వే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా ఎదిగింది. 2024 నాటికి 68,584 కి.మీ రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉంది.  దేశంలో రోజు రోజుకు రైళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో ప్రస్తుతం 22,593 రైళ్లు ఉన్నాయి. వాటిలో 13,452 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. మిగిలినవి గూడ్స్ రైళ్లు. మార్చి 2024 నాటికి, భారతీయ రైల్వే 14,781 లోకోమోటివ్‌లు, 91,948 ప్యాసింజర్ కోచ్‌లు, 318,196 సరుకు రవాణా వ్యాగన్‌ లను ఉపయోగించింది.


రోజూ ఎంత మంది రైల్వే ప్రయాణం చేస్తారంటే?

భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది తమ గమ్యస్తానాలకు చేరుకుంటారు. సాధారణ రోజున దాదాపు 2.4 కోట్ల మంది ప్రయాణికులు  రైలు ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే నివేదికల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే  రోజుకు దాదాపు 13,198 ప్యాసింజర్ రైళ్లను నడిపించింది. దేశంలోని 7,325 స్టేషన్లకు ప్రజా రవాణా కొనసాగిస్తున్నాయి. కనెక్టివిటీ, ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడానికి, భారతీయ రైల్వేలు వందే భారత్ రైళ్ల సంఖ్యను విస్తరిస్తోంది. ప్రస్తుతం, భారతదేశం అంతటా 136 రైలు మార్గాల్లో 69 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైలు సెట్లలో వేర్వేరు సంఖ్యలో కార్లు ఉన్నాయి. 8-కార్లు, 16-కార్లు, 20-కార్ల రైలు సెట్లు అందుబాటులో ఉన్నాయి. రైల్వే నెట్ వర్క్ కూడా రోజు రోజుకు విస్తరిస్తోంది.

Read Also: రైల్వే టికెట్ కౌంటర్ బాధ్యతలను బయట వ్యక్తులకు ఇచ్చి ఉద్యోగులు రిలాక్స్, కట్ చేస్తే..

చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించిన ప్రధాని మోడీ

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలోనే ఎత్తైన వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు, ఇది నదీగర్భం నుండి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది పారిస్‌ లోని ఐకానిక్ ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంది. చీనాబ్ నదిని విస్తరించి ఉన్న ఈ నిర్మాణం.. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL)లో భాగంగా ఉంది. ఈ బ్రిడ్జి ఇప్పుడు పూర్తి స్థాయిలో తన సేవలను అందిస్తున్నది. కాశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో నేరుగా రైల్వే లింక్ ను ఏర్పాటు చేస్తుంది. వచ్చే 5 సంవత్సరాల్లో ఏకంగా 1,000 కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Read Also:  ఆమె మెట్రో రైలు ప్రమాదంలో చనిపోయింది.. కానీ, ఆమె ఫోన్ నుంచి కొడుకు, చెల్లికి కాల్స్.. అదెలా?

Related News

Trains cancelled: 68 రైళ్లు రద్దు, 24 తిరిగి ప్రారంభం.. ఆ లైన్ లో ఊరట కలిగించిన రైల్వే ప్రకటన..!

Railways TC: అబ్బా.. ఎవరీ హ్యాండ్సమ్.. నెట్టింట వైరల్ అవుతున్న రైల్వే టీసీ వీడియో!

New Visa Rules: వీసా నిబంధనలు మరింత కఠినతరం, ఇక ఆ దేశానికి వెళ్లడం అంత ఈజీ కాదు!

Special Trains: పండుగ సీజన్ కోసం మరో 150 ప్రత్యేక రైళ్లు, ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్!

Metro news 2025: ఆ నగరానికి బూస్ట్.. రూ.15,906 కోట్ల భారీ మెట్రో ప్రాజెక్ట్.. ఇక జర్నీ చాలా సింపుల్!

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Big Stories

×